ఫ్యాన్స్ అందు పవన్ ఫ్యాన్స్ వేరయ్యా అన్నట్లుగా ఉంటారు. మామూలుగా తమిళ హీరోల ఫ్యాన్స్ మరీ వైలెంట్ గా ఉంటారు. వారు తమ హీరోను చిన్న మాట అన్నా కూడా ఊరుకోరు. అలాంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కనిపిస్తూ ఉంటాయి. సోషల్ మీడియా కాని డైరెక్ట్ గా కాని పవన్ ఫ్యాన్స్ చేసే సందడి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమద్య అల్లు అర్జున్ పై పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ విషయం తెల్సిందే. బన్నీ చెప్పను బ్రదర్ అంటూ చేసిన వ్యాఖ్యలతో పవన్ ఫ్యాన్స్ ఈగో బాగా హర్ట్ అయ్యి సరైనోడు మరియు డీజే చిత్రాలకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది.
ముఖ్యంగా డీజే చిత్రం సమయంలో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నానా రచ్చ చేశారు. బన్నీతో పాటు ఆ సినిమా దర్శకుడు అయినా హరీష్ శంకర్ ను కూడా ఇష్టానుసారంగా తిట్టేసేవారు. పవన్ అభిమానిని అని చెప్పుకునే నువ్వు ఎలా బన్నీతో సినిమా చేస్తావంటూ కొన్ని వందల మంది సోషల్ మీడియా ద్వారా హరీష్ శంకర్ ను ప్రశ్నించేవారట. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడం.. తిట్టడం లాంటివి చేస్తే వందలాది మందిని హరీష్ శంకర్ బ్లాక్ చేయడం కూడా జరిగింది.
ఇప్పుడు మళ్లీ హరీష్ శంకర్ తన తదుపరి చిత్రాన్ని పవన్ తో చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఈ నేపథ్యం లో ఆయన్ను మళ్లీ పవన్ ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకుంటున్నారు. అప్పుడు తిట్టిన వారు ఇప్పుడు అన్నా నువ్వు పవన్ కు మరో గబ్బర్ సింగ్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. అప్పట్లో చాలా మంది హరీష్ శంకర్ అకౌంట్ లో బ్లాక్ అయ్యారు. ఇప్పుడు వారు కూడా తమ అకౌంట్స్ ను అన్ బ్లాక్ చేయమంటూ హరీష్ ను కోరుతున్నారు. మొత్తానికి హరీష్ ను డీజే సమయంలో దుమ్ము దుమ్ముగా విమర్శించిన పవన్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఆయన ఒక దేవుడు మాదిరిగా కనిపిస్తున్నాడు. పవన్ 28 చిత్రాన్ని హరీష్ ఎలా తీయనున్నాడో చూడాలి.