ఈనాటి ఈ మెగాబంధం ఏనాటిదో!!

Update: 2018-03-27 12:44 GMT
ఇవాళ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. సోషల్ మీడియా అంతటా కూడా రామ్ చరణ్ హంగామానే కనిపించింది. చెర్రీ న్యూ ఫిలిం రిలీజ్ కు ముందు వచ్చిన పుట్టిన రోజు కావడంతో.. ఈ హంగామా మరింత ఎక్కువగా ఉంది.

అయితే.. ఇవాళ చెర్రీ బర్త్ డే సందర్భంగా ఎన్ని అంశాల గురించి చెప్పుకున్నా.. వాటిలో మెగా ఫ్యామిలీతో కలిసి చేసుకున్న పుట్టిన రోజు వేడుకలనే హైలైట్ గా చెప్పుకోవాలి. తండ్రి చిరంజీవి.. తల్లి సురేఖలతో కలిసి రామ్ చరణ్ వేడుకలను జరుపుకోగా.. ఈ కేక్ కటింగ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ కూడా అటెండ్ కావడం ఆకట్టుకుంది. ఒక వైపు మెగా స్టార్.. మరోవైపు పవర్ స్టార్.. మధ్యలో మెగా పవర్ స్టార్.. పక్కనే చెర్రీ మదర్ సురేఖ.. మెగా ఫ్యాన్స్ కు ఇదో అద్భుతమైన పిక్ అయిపోయింది. అసలు ఇలాంటి రోజు కోసం ఎన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నామో కదా అనుకుంటున్నారు అభిమానులు. చాలా కాలం తరువాత ఒక అద్భుతం జరిగిందని తెగ సంతోషించేస్తున్నారు.

ఈ అద్భుతమైన ఫోటోలో మరో అంశాన్ని గురించి కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి. మెగాస్టార్ వైఫ్ సురేఖ.. ఇటు తన కొడుకు రామ్ చరణ్ తో ఎంత ఆప్యాయంగా ఉందో.. అటు తన మరిది అయిన పవన్ కళ్యాణ్ పై కూడా అంతే ప్రేమను కురిపిస్తున్నారు. తనకు సురేఖ అమ్మతో సమానం అని అప్పుడప్పుడు పవన్ ఎందుకు చెబుతాడో.. వారి అనుబంధం ఎంతటి స్ట్రాంగ్ అనే అంశం ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది.
Tags:    

Similar News