మెగాస్టార్ సినిమాలో పవన్ 30 నిమిషాలే

Update: 2017-11-02 16:24 GMT
టాలీవుడ్ లో 100 కోట్లు కొల్లగొట్టే హీరోలు ఉన్నారు. కోట్లది మంది అభిమానులను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాగే సూపర్ డైలాగులతో విజిల్స్ వేయించి.. యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించే దర్శకులు ఉన్నారు. అద్భుతమైన కథలను రాసే రచయితలు కూడా ఉన్నారు. ఇంత పనితనం గలవారు ఉన్నా కూడా..  మన తెలుగు ప్రేక్షకుల దురదృష్టం ఏమిటో గాని బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలను మాత్రం ఇంకా చూడలేకపోతున్నాం.

తమ అభిమాన హీరోలు కలిసి సినిమా చేస్తే ఎంతో బావుంటుందని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అయితే త్వరలోనే ఒక అద్భుతమైన మల్టీ స్టారర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు చూస్తారు అనే టాక్ వినిపిస్తోంది. అది కూడా మెగా హీరోలు కావడం ఇంకా పెద్ద విశేషం. మెగాస్టార్ - పవర్ స్టార్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ ఆ సినిమాను తెరకెక్కిస్తాడట. అయితే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ 30నిమిషాలు మాత్రమే ఉంటాడని తెలుస్తోంది. పూర్తి మల్టీస్టారర్ కాకపోయినా కూడా పవర్ స్టార్ అన్నయ్య చిరంజీవి సినిమాలో ఉంటే ఆ కిక్కు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

త్రివిక్రమ్ - చిరంజీవితో సినిమాను చెయ్యాలని ఆయన రచయిత గా ఉన్నప్పటి నుంచే అనుకుంటున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ 152వ సినిమా త్రివిక్రమ్ తోనే ఉంటుందని సమాచారం. గతంలో మెగాస్టార్ జై చిరంజీవ కి త్రివిక్రమ్ కథ-మాటలను అందించాడు. ఇక పవన్ కళ్యాణ్ అన్నయ్యతో కలిసి శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో 5 నిమిషాలు కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మాత్రం 30 నిమిషాల పాటు అన్నయ్యతో స్క్రిన్ షేర్ చేసుకోన్నాడట పవర్ స్టార్.

ప్రస్తుతం మెగాస్టార్ సైరా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ తన 25వ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. మరి ఈ ఇద్దరి కలయికలో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.
Tags:    

Similar News