వాజ్ పేయ్ మరణంపై సినీప్రముఖుల స్పందనలు వేడి పెంచుతున్నాయ్. ఆయనపై ఒక్కొక్కరు కురిపిస్తున్న ప్రేమాభిమానాలు మనసును టచ్ చేస్తున్నాయ్. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మహా నాయకుడి మరణంపై స్స్పందించారు.
వాజ్ పేయి ఒక వ్యక్తి కాదు.. శక్తి. విలువలతో కూడిన ఆయన రాజకీయం ఈ నాటి రాజకీయ నాయకులకు సర్వదా ఆచరణీయం. నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన. వాజ్‌పేయి రాజకీయ జీవిత ప్రయాణంలో కాంతులీనే కోణాలు ఎన్నో.. మేలి మలుపులు మరెన్నో. బహు భాషా కోవిదుడైన ఆయన ప్రసంగాలు రాజనీతి మేళవింపుగా - ఎంత సేపు విన్నా వినాలనిపించేవిగా ఉంటాయి. భారత దేశాన్ని అణుశక్తిగా ఆవిష్కరించడానికి ఆయన చూపిన వజ్ర సంకల్పం - దేశ రక్షణకు కవచంగా మారింది. శత్రువులు మనవైపు కన్నెత్తి చూడటానికి భయపడేలా చేసింది. ఆయన హయాంలో మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భారత మాత ముద్దు బిడ్డగా పుట్టడం జాతి అదృష్టం. ఈ పుణ్యభూమికి ప్రధాన మంత్రిగా సేవలు అందించడం మన భాగ్య ం. ఆయనకు భారత జాతి ఎంతో రుణపడి ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను... అంటూ పవన్ విషణ్ణవదనంతో స్పందించారు.
వాజ్ పేయ్ మరణంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంజయ్ దత్ - దియా మీర్జా - విశాల్ దడ్లానీ - సుభాష్ ఘయ్ - ప్రియదర్శన్ - లతా మంగేష్కర్ - ఇషా గుప్తా - బొమన్ ఇరానీ - వివేక్ ఒబెరాయ్ - కైలాష్ ఖేర్ - రణదీప్ హుడా - ధనుష్ - మోహన్ లాల్ వంటి స్టార్లు నివాళులు అర్పించారు. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. జాతి కోసం ఆయన చేసిన సేవల్ని మర్చిపోలేమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు.