‘సర్దార్’ రిలీజయ్యాక బాబీతో పవన్ ఏమన్నాడు?

Update: 2017-11-20 09:52 GMT
పవన్ కళ్యాణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్లలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కూడా ఒకటి. గబ్బర్ సింగ్ పాత్ర మీద విపరీతమైన ప్రేమతో స్వయంగా తనే ఈ సినిమాకు స్క్రిప్టు సమకూర్చాడు పవన్. ముందు సంపత్ నందిని దర్శకుడిగా అనుకుని.. ఆ తర్వాత అతడిని తప్పించి ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బాబీకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. ఐతే ఈ సినిమా ఇద్దరికీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమాలో పవన్ దే కీలక పాత్ర అయినప్పటికీ బాబీ కూడా ఫెయిల్యూర్ బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. ఐతే ‘సర్దార్’ రిలీజయ్యాక తాను ఈ సినిమా రివ్యూలు అవీ చూసి టెన్షన్ పడుతుంటే తనకు పవన్ ఫోన్ చేసి ధైర్యం చెప్పినట్లు బాబీ వెల్లడించాడు.

రివ్యూలు చదివి మనసు పాడు చేసుకోవద్దని.. టెన్షన్ పడొద్దని.. కాన్ఫిడెంటుగా ఉండాలని.. మంచే జరుగుతుందని పవన్ ధైర్యం చెప్పాడట. పవన్‌ తో పాటు ఇంకో ఇద్దరు హీరోలు కూడా తనకు సపోర్ట్ ఇచ్చినట్లు బాబీ వెల్లడించాడు. అందులో ఒకరు తన తొలి చిత్ర కథానాయకుడు రవితేజ అట. మంచి కథ రెడీ చేసుకో.. సినిమా చేద్దాం అని రవితేజ తనకు మనోధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేసినట్లు బాబీ వెల్లడించాడు. ఐతే వీళ్లిద్దరూ కాకుండా మరో హీరో తనకు ఫోన్ చేయడం ఆశ్చర్యపరిచినట్లు బాబీ తెలిపాడు. అతనే సాయిధరమ్ తేజ్ అట. అతను కూడా ఫోన్ చేసి మనిద్దరం కలిసి సినిమా చేద్దామని మాట్లాడటం తనకెంతో సంతోషాన్ని కలిగించిందన్నాడు. తేజుది ఎలాంటి మంచి మనసో చెప్పడానికి ఇది ఉదాహరణ అన్నాడు బాబీ.
Tags:    

Similar News