బన్నీ పంచె కట్టు.. చెప్పను బ్రదర్

Update: 2017-05-16 09:44 GMT
ఈ మధ్యన ఓ ఇద్దరి స్టార్స్ ఫాన్స్ మధ్య గొడవ చిరిగి చిరిగి పెరిగి పెరిగి పెద్దదైంది. అల్లు అర్జున్ ఒక ఆడియో ఫంక్షన్లో నేను చెప్పాను బ్రదర్ అన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ వీక్షకులు దీని హ్యాష్‌ టాగ్ పెట్టి తెగ రాద్దాంతం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఫాన్స్ జోలికి వెళ్ళితే మామూలుగా ఉండదుని అల్లు అర్జున్ కి కాస్త ఇబ్బందినే కలిగించారు. అయితే ఇప్పుడు బన్నీ అందుకుగాను వారి ఐస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా?

బాహుబలి సినీ రచయత విజయేంద్ర ప్రసాద్ ఈ మద్యనే.. “నేను బాహుబలి ఇంటర్వల్ సీన్ పవన్ ఫాన్స్ అండ్ పవన్ కళ్యాణ్‌ ను ఊహించి రాసుకున్న” అని అన్నారు. దీన్నితో బన్ని ఇప్పుడు పవన్ ఫాన్స్ కి భళ్లాలదేవలా కనిపిస్తున్నాడంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఇకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం సినిమా సాంగ్ టీజర్లో పంచే కట్టి ఒక డాన్స్ స్టెప్ వేశాడు. ఇప్పుడు మళ్ళీ అది హాట్ టాపిక్ అయింది. ఈ స్టెప్ పవన్ అభిమానులను శాటిస్ఫై చేయడానికి కాటమరాయుడు తరహాలో వేశాడని కొందరు అంటుంటే.. పవన్ ను కాపీ చేశాడని ఇంకొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి.

డిజె సినిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అతను పవన్ కల్యాణ్ కి వీరాభిమాని. అందుకే అలా పెట్టి ఉంటాడేమో అని కొందరు చెబుతున్నారు. ఏ వాదన ఎలా ఉన్నా ఆ పంచె కట్టు పవన్ ను ఇమ్మిటెట్ చేసినట్టు ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని పవన్ ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు.​ దీని మీద మీ కామెంట్ ఏంటంటారు? చెప్పను బ్రదర్ అంటారా.. సరే కానివ్వండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News