పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేన్నరేళ్ల విరామం తరువాత రీమేక్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిందీలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న `పింక్` ఆధారంగా వపన్ చేసి రీమేక్ ఫిల్మ్ `వకీల్ సాబ్`. ఈ మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన పవన్ కల్యాణ్ ఈ మూవీతో మరో హాట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ మూవీ తరువాత కూడా పవన్ మళ్లీ రీమేక్ మూవీనే ఎంచుకున్న విషయం తెలిసిందే.
ఈ సారి మలయాళ రీమేక్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`ని ఎంచుకున్నారు. ఈ మూవీని తెలుగులో `భీమ్లానాయక్` పేరుతో రీమేక్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీకి `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందించి భారీ వసూళ్లని రాబట్టింది. ఇదిలా వుంటే ఈ మూవీలతో పాటు పవన్ కల్యాణ్ స్ట్రెయిట్ స్టోరీతో `హరి హర వీరమల్లు` మూవీని చేస్తున్నారు.
క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ గత కొన్ని నెలలుగా నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల చిత్ర బృందంతో నిర్వహించిన వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని అభిమానులు భావించారు. కానీ ఇటీవల పవన్ వైజాగ్ పర్యటన తరువాత ఈ మూవీ తాజా షెడ్యూల్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదని తేలిపోయింది.
ఇదిలా వుంటే పవన్ త్వరలో `వినోదాయ సితం` రీమేక్ లో నటించబోతున్నారు. సముద్రఖని నటించి తెరకెక్కించిన ఈ మూవీ జీ5లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇదే మూవీని తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. సాయి ధరమ్ తేజ్ మరో కీలక పాత్రలో నటించనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయబోతున్నారట. అయితే అభిమానులు మాత్రం ఆ రీమేక్ ని పక్కన పెట్టమంటున్నారట.
అందరిలా ఏదైనా స్ట్రెయిట్ మూవీని చేయమంటున్నారట. ఇప్పటి వరకు చేసిన రీమేక్ లు చాలని, ఇక రీమేక్ లు ఆపి స్ట్రెయిట్ కథలతో సినిమాలు చేయండని సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారట. రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలైన `థాంక్ గాడ్` మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈ మూవీని `వినోదాయ సితం` ఆధారంగా చేశారంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో ఫ్యాన్స్ ఇలాంటి రీమేక్ ని చేయడం మానేసి ఆ స్థానంలో ఏదైనా స్ట్రెయిట్ స్టోరీని చేయమని చెబుతున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.