వీరమల్లు చెప్పిన డేట్ కు సాధ్యమేనా?

Update: 2021-09-03 07:30 GMT
పవన్‌ కళ్యాణ్.. క్రిష్‌ ల కాంబోలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమాను సెకండ్‌ వేవ్‌ కు ముందు 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. 2022 సంక్రాంతికి విడుదల చేసేందుకు గాను కరోనా అడ్డు వచ్చింది. కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా హరి హర వీరమల్లు సినిమాను సంక్రాంతి నుండి తప్పించి సమ్మర్ కు వాయిదా వేశారు. సంక్రాంతికి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా వచ్చేందుకు సిద్దం అవుతోంది. సంక్రాంతి వరకు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాని నాలుగు అయిదు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచేందుకు గాను సిద్దం అవుతున్నాయి.

సంక్రాంతి బరిలో ప్రస్తుతం నిలిచిన సినిమాల్లో కనీసం రెండు మూడు అయినా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయింటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు వచ్చే ఏడాది సమ్మర్ సేఫ్ గా కరోనా ఫ్రీగా ఉంటే వారంకు రెండు పెద్ద సినిమాల చొప్పున బ్యాక్ టు బ్యాక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడుతూ ఉన్నాయి. థర్డ్‌ వేవ్‌ అంటున్నారు కనుక విడుదల విషయంలో నమ్మకం అనేది లేకుండా పోయింది. చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్దకు ఎప్పుడు వచ్చేది క్లారిటీ లేకుండా ఉంది.

హరిహర వీరమల్లు సినిమా కూడా ప్రకటించనైతే ప్రకటించారు కాని విడుదలెంత వరకు సాధ్యం అనేది కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానం. ఎందుకంటే గత ఏడాది నుండి విడుదల అవ్వాల్సిన సినిమాలు డేటు ప్రకటిస్తున్నారు వాయిదా వేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కనుక వచ్చి మూడు నెలలు మళ్లీ థియేటర్లు మూత పడితే ఖచ్చితంగా హరి హర వీరమల్లు సినిమా నిన్న ప్రకటించినట్లుగా ఏప్రిల్‌ విడుదల అసాధ్యం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అంటున్నారు.
Tags:    

Similar News