పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా తర్వాత మలయాళ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో బిజూ మీనన్ పోషించిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నాడు. ఇక ఈ మల్టీస్టారర్ లో మరో ప్రధాన పాత్రలో దగ్గుబాటి రానా నటించనున్నాడు. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నాడు. సోమవారం (డిసెంబర్ 21) ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇప్పుడు పవన్ - రానా రెమ్యూనరేషన్స్ గురించి ఫిలిం సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడ్ తో సినిమాలు ఓకే చేస్తున్న పవన్ కళ్యాణ్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. పారితోషకం కూడా భారీగా తీసుకుంటున్న పవన్.. ఇప్పుడు ఈ మలయాళ రీమేక్ కోసం సుమారు 50 కోట్ల వరకు తీసుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులోనూ పవన్ దీనికి 40 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చాడట. ఇక మరో హీరో రానాకి నిర్మాతలు దాదాపు 5 కోట్ల వరకు ఇస్తున్నారని టాక్ నడుస్తోంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.