తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ బ్యూటీ ప్రణీత. 2010లో 'ఏం పిల్లో ఏం పిల్లడో' అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టిన ప్రణీత.. ఆ తర్వాత బావ, పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది, మంచు ఫ్యామిలీతో పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలలో కనిపించింది. ఇక ప్రణీత చివరిగా కనిపించిన సినిమా హలో గురూ ప్రేమకోసమే. రామ్ సరసన నటించిన ఈ సినిమా అమ్మడికి పెద్దగా గుర్తింపు తేలేకపోయింది. ప్రణీత కెరీర్ లో ఇప్పటివరకు మాక్సిమం సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ పోషించింది. అత్తారింటికి దారేది హిట్ తర్వాత ప్రణీత నటించిన సినిమాలేవి పెద్దగా హిట్ కాలేదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఆఫర్స్ కూడా పెద్దగా లేవు.
కరోనా సంక్షోభంలో తనకి తోచిన సాయం చేస్తూ అందరి మన్ననలు అందుకుంటుంది. కరోనా బాధితుల కోసం స్పందించే హీరోయిన్స్ లో ప్రణీత ముందువరుసలోనే ఉంటుంది. అత్తారింటికి దారేది లాంటి మాంచి కమర్షియల్ హిట్టు పడ్డాక అమ్మడికి మళ్లీ కమర్షియల్ బ్రేక్ రాకపోవడంతో టాలీవుడ్‌లో ప్రణీతకు అవకాశాలు కరువయ్యాయి అలాగే తన మాతృభాష కన్నడలో కూడా ప్రణీతను పట్టించుకునే వారు లేరట. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి తప్పదు. ఎందుకంటే బ్రేక్ వచ్చేవరకు వేచి ఉండాల్సిందే. ఇలా వెయిట్ చేస్తూనే ప్రణీత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తోంది.
దాదాపు కెరీర్ ప్రారంభించిన పదేళ్లకు ప్రణీత బాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతుంది. అదికూడా ఒకేసారి రెండు సినిమాలను లైన్ లో పెట్టేసింది. కానీ ఆ రెండు కూడా థియేట్రికల్ రిలీజ్ కాకుండా డిజిటల్ అవుతుండటం వలన కొంచం నిరాశగా ఉన్నటకు టాక్. ఆమె నటించిన "భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా" - హంగామా 2. ఈ రెండు సినిమాలు ఇదివరకు థియేట్రికల్ రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా థియేటర్స్ క్లోస్ అయ్యేసరికి అందరూ ఓటిటి రిలీజ్ వైపు మళ్లుతున్నారు. అయితే ఆల్రెడీ భుజ్ మూవీ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అలాగే ఇదేబాటలో హంగామా సీక్వెల్ కూడా హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ నిర్ణయించుకున్నారట. మరి చూడాలి అమ్మడి అదృష్టం ela ఉందో..!