పార్ట్ టైమ్ జాబ్ ప్రాధాన్యత ఎంతో తెలిసిందే. ప్రతిభావంతులకు ఇలాంటి అవకాశాలుంటాయి. అయితే రాజకీయాల్లో ఉన్న వాళ్లకు కూడా పార్ట్ టైమ్ జాబ్స్ కుదురుతుందా? అంటే .. కుదురుతుందనే ప్రూవ్ చేయబోతున్నాడట జనసేనాని పవన్ కల్యాణ్. ఇంతకీ ఆయన చేయబోయే పార్ట్ టైమ్ జాబ్ ఏదై ఉంటుందో చెప్పగలరా?
కచ్ఛితంగా మీరు ఊహించేదే. ఆ పార్ట్ టైమ్ జాబ్ నటన. రోజూ మూడు గంటల పాటు ముఖానికి మేకప్ వేసుకుని ఆయన ఈ పరిమిత కాల ఉద్యోగం చేస్తారట. అందుకు ఇప్పటికే బోనీకపూర్ - దిల్ రాజు- వేణు శ్రీరామ్ బృందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఓవైపు రాజకీయాల్లో తలమునకలుగా ఉంటూనే ఈ పార్ట్ టైమ్ ని నడిపిస్తారట. అయితే మూడు గంటలు చాలదు.. కనీసం ఆరుగంటలు అంటూ నిర్మాతలు అడుగుతున్నారట.
రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ ఎంత ఒత్తిడి ఉంటుందో చెప్పలేం. అందుకు తగ్గట్టే పవన్ షెడ్యూల్స్ ని కేటాయిస్తారు. రోజులో తన సమయం ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారట. దానికనుగుణంగా ఇప్పుడు పింక్ తెలుగు రీమేక్ షెడ్యూల్స్ ని డిజైన్ చేస్తున్నారని తెలిసింది. ఈ రీమేక్ చిత్రంలో కోర్ట్ సన్నివేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వాటిలో పవన్ అప్పియరెన్స్ ఉంటుంది. 4-5 నెలల షూటింగులో పవన్ పై షూటింగ్ తక్కువ రోజుల్లో అయిపోయేలా ప్లాన్ చేస్తున్నారట. జూన్ 2020లో రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన పింక్ ని తమిళంలో అజిత్ కథానాయకుడిగా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న బోనీ కపూర్ పట్టు పట్టి మరీ పవన్ ని ఒప్పించారు. దిల్ రాజు ఇందులో భాగస్వామి అవ్వడంతో ఆసక్తి పెరిగింది. ఎట్టకేలకు పవర్ స్టార రీఎంట్రీ మూవీ పట్టాలెక్కబోతోంది. ఆ మేరకు ఈ ప్రాజెక్టుపై బోనీని సంప్రదించి బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తాజా అప్ డేట్ పై క్లారిటీనిచ్చేశారు ఇప్పటికే. రాజకీయ నాయకుడు పార్ట్ టైమ్ జాబ్ అనే కొత్త కాన్సెప్ట్ బహుశా పవన్ తోనే మొదలవుతుందని భావించవచ్చు. రెండు పడవల పయనంలా రెండు సీరియస్ ఉద్యోగాల్ని ఆయన ఎలా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తారో చూడాలి.