పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో దిగేందుకు గాను సినిమాలు మానేస్తాను అనేశాడు. కాని ఆర్థిక అవసరాల కోసం అంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. దాదాపు పదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేయాలని.. ఆయన నుండి ఏడాదికి రెండు మూడు సినిమాలు రావాలని అభిమానులు కోరుకున్నారు. కాని ఆయన మాత్రం అభిమానుల కోరిక ఒకసారి కాకుంటే ఒక్కసారి కూడా తీర్చలేదు. కాని ఇప్పుడు మాత్రం పవన్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ పై దాడి చేసేందుకు సిద్దం అవుతున్నాడు. అభిమానులు ఊహించని రేంజ్ లో సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఈ ఏడాదిలో ఇంత కరోనా ఉన్నా కూడా వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక వచ్చే ఏడాదిలో పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ మరియు హరి హర వీరమల్లు సినిమాలు విడుదల కన్ఫర్మ్. అంతా సవ్యంగా.. అనుకున్నట్లుగా జరిగితే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భవదీయుడు భగత్ సింగ్ ను కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది కొత్తగా పవన్ మొదలు పెట్టబోయే సినిమాల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ మూవీ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా కన్ఫర్మ్ కాని రెండు సినిమాల గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. అందులో మొదటిది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పవన్ హీరోగా ఒక సినిమా. ప్రస్తుతం ధనుష్ సినిమా పనిలో ఉన్న శేఖర్ కమ్ముల వచ్చే ఏడాది ప్రథమార్థం ముగింపు వరకు ముగించేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తాడని సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమా ఒక విభిన్నమైన మెసేజ్ ఓరియంటెడ్ కమ్ పొలిటికల్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ ను కమ్ముల చెప్పడం జరిగింది.. పవన్ ఓకే చెప్పడం కూడా జరిగి పోయిందట. ప్రముక నిర్మాత వీరి కాంబో సినిమాను నిర్మించేందుకు ఇప్పటికే ముందుకు వచ్చాడని.. ఇద్దరికి అడ్వాన్స్ లు కూడా ఇవ్వడం జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
శేఖర్ కమ్ముల సినిమాకు అటు లేదా ఇటు అన్నట్లుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను పవన్ కళ్యాణ్ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. కమర్షియల్ మాస్ సినిమాలకు పెట్టింది పేరైన అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను చేస్తున్నాడు. వరుసగా ఈయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను దక్కించుకుంటూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈయన అపజయం అనేది ఎరుగడు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ను అనీల్ తో చేయాలనే నిర్ణయానికి వచ్చాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే పట్టాలెక్కి వచ్చే ఏడాదిలోనే ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. విడుదల విషయంలో మాత్రం 2023 వరకు ఆగాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. శేఖర్ కమ్ముల ఫిదా మరియు లవ్ స్టోరీ సినిమాలతో తనకు తాను ఒక కమర్షియల్ డైరెక్టర్ గా ప్రొజెక్ట్ చేసుకోవడంలో సఫలం అయ్యాడు. అందుకే పవన్ వంటి భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ను డైరెక్ట్ చేసేందుకు సిద్దం అయ్యాడు. వీరిద్దరి కాంబో మూవీ ఫిదా చేయడం కన్ఫర్మ్ అంటూ అభిమానులు భావించడం ఖాయం. ఇక అనీల్ రావిపూడి దర్శకత్వం లో పవన్ చేయబోతున్న సినిమా కూడా పటాస్ మాదిరిగా మాస్ బాంబ్ లా పేలుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.