ఓ పుష్కరం క్రితం అంటే 2013లో పవన్ కళ్యాణ్ మూవీ జానీ విడుదల అయింది. ఆ సినిమా కోసం పవన్ రెండేళ్ల పాటు విపరీతంగా శ్రమించాడు. అన్నీ తానై తీశాడు. స్టోరీ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్ - సాంగ్స్ - ఫైట్స్,.. ఇలా పవన్ చూసుకోని డిపార్ట్ మెంట్ అనేదే లేదు.
ఆ తర్వాత కూడా పవన్ కి డైరెక్షన్ పై మక్కువ చాలానే ఉంది. అసలు గబ్బర్ సింగ్ ను తానే డైరెక్ట్ చేద్దామనుకుని కూడా.. చివర్లో హరీష్ శంకర్ చేతిలో పెట్టాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. హైద్రాబాద్ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసేస్తారని తెలుస్తోంది. ఇప్పుడు సర్దార్ కోసం కూడా పవన్ అన్ని విభాగాల్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాడని అంటున్నాయి యూనిట్ వర్గాలు. స్టోరీ - డైలాగ్స్ - స్క్రీన్ ప్లే విషయాల్లో పవన్ చాలా ఎఫర్ట్ పెడుతున్నాడని చెబ్తున్నారు.
ఆఖరికి ఒక పోస్టర్ రిలీజ్ చేసినా, దానిలో పవన్ క్రియేటివిటీ కనిపిస్తోంది. ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలో పవన్ కి బాగా తెలుసంటోంది సర్దార్ యూనిట్. కానీ పవన్ అంత దగ్గరుండి అన్నీ చూసుకున్న సినిమాల విషయంలో, రిజల్ట్ అంత గొప్పగాం ఏం లేదు. మరోసారి జానీ తర్వాత అంతగా పవన్ మనసు పెట్టి, తపన పడి తీస్తున్న సినిమాగా సర్దార్ నే చెప్పాలి. మరి సమ్మర్ లో వచ్చే ఈ మూవీ.. రిజల్ట్ మాత్రం జానీలా కాకూడదని, ఫ్యాన్స్ మొక్కేసుకుంటున్నారు.