స్టార్ డమ్ మోయడం నచ్చదట

Update: 2016-04-04 13:30 GMT
సినిమాలలో ఎలా వున్నా బయట పవన్ చాలా సాదా సీదా మనిషి. ఫామ్ హౌస్ లో పొలం పనులు చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ ఎక్కువ సమయం గడిపేస్తూవుంటాడు. అన్నయ్య వలన ఈ వృత్తిలోకి వచ్చనేగానీ తనకెప్పుడూ నటుడవ్వాలనే కోరికలేదని చెప్తూనే వున్నాడు.

తాజాగా పవన్ హిందీ గబ్బర్ సింగ్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొత్త పాయింట్లు బయటకొచ్చాయి. తనకు స్టార్ డమ్ ని క్యారీ చెయ్యడం ఇష్టం లేదని మిగతా వాళ్ళతో ఈ స్టేట్మెంట్ ని పోల్చకుడదని, వాళ్ళంతా ప్రొఫెషనల్ యాక్టర్ లని, తను మామోలు వ్యక్తినని చెప్పుకొచ్చాడు.

అంతేకాక తనకి పాటలు, డ్యాన్స్ ల విషయంలో ఇప్పటికీ కంఫర్ట్ లేదని తెలిపాడు. తెలుగులో అభిమానించే హీరోలలో నందమూరి తారక రామారావుగారు ఆ తరువాత అన్నయ్య చిరంజీవి గారు ఉంటారని చెప్పాడు.
Tags:    

Similar News