పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ధమాకా ప్రకటనలు అభిమానుల్లో జోష్ నింపిన సంగతి తెలిసిందే. ముందుగా `పింక్` రీమేక్ ని `లాయర్ సాబ్` (పీఎస్ పీకే 26) పేరుతో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పట్టాలెక్కించారు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో 27వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తోనూ మరో చిత్రాన్ని ఖాయం చేశారని వార్తలొచ్చాయి.
అటు రాజకీయాలను.. ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేసి రెండు పడవల ప్రయాణం చేయాలని పవన్ భావించారు. కానీ మాటలు వేరు...చేతలు వేరు అని ప్రాక్టికల్ గా ఇప్పుడు పవన్ కి బాగా అర్ధమవుతోందనే విమర్శ తాజాగా ఎదురవుతోంది. ఇటీవలే కర్నూల్లో పొలిటికల్ భేటీ సందర్భంగా పవన్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. నాలుగైదు రోజుల పాటు అక్కడి వ్యవరాలతో పాటు అమరావతి రాజధాని విషయమై జనసేన నేతలతో చర్చించాలని నిర్ణయించి బయలు దేరారు.
ఆ పనులన్నింటినీ ఈనెల 20వ తేదీలోపు ముగించుకుని ఆ తర్వాత నుంచి మళ్లీ యాథావిథిగా షూటింగ్ కు హాజరు కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ ఇప్పుడప్పుడే తిరిగి షూటింగ్ లకు హాజరయ్యే అవకాశం లేదని సన్నిహిత వర్గాలు లీకులిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు సరిగ్గా లేవని...ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు రావడం వంటి పరిణామం కారణంగా పవన్ షూటింగులకు హాజరవ్వడం మరికాస్త ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. దీంతో లాయర్ సాబ్ నిర్మాత దిల్ రాజు.. క్రిష్ ఎదురు చూడక తప్పని పరిస్థితి ఉందిట.
పవన్ చెప్పిన తేదీకి షూటింగ్ కి రాకపోతే ఆ మేరకు నిర్మాతలకు నష్టం తప్పదు. మిగతా ఆర్టిస్టుల డేట్లు మళ్లీ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే నిర్మాత అదనంగా పారితోషికాలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితి తలెత్తేలా ఉందని దిల్ రాజు...పీఎస్ పీకే 27వ సినిమా నిర్మాతలు టెన్షన్ లో పడ్డారట. షూటింగ్ ఆరంభంలోనే ఇలా జరిగితే పూర్తయ్యేసరికి ఇంకెన్ని బ్రేకులు పడతాయో! అసలు ప్రకటించిన తేదీకి సినిమాల్ని రిలీజ్ చేయగలమా? లేదా? అంటూ ఇప్పుడు ఆలోచనలో పడ్డారుట. అయితే పవన్ మాత్రం ఈ విషయాలన్నిటిపైనా సదరు నిర్మాణ సంస్థలతో ముందే చర్చించారట. ఆ విధంగా అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా నిర్మాతలకు మాత్రం తిప్పలు తప్పేలా లేవు.
ఇక ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు పరిణామం జనసేనాని పవన్ కల్యాణ్ కి బోలెడంత టైమ్ వేస్ట్ చేస్తోందన్న వాదనా అభిమానుల్లో వినిపిస్తోంది. రాజకీయ పోరాటాలు అంటేనే బోలెడంత సమయం వృధా. అటు కొంత ఇటు కొంత టైమ్ కేటాయించడం అంటే మింగుడు పడనిది.. సాధ్యపడనిది! అన్న సందేహం వ్యక్తమవుతోంది.