పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మైండ్ లో ఏం ఉంది? ఆయన జనసేనానిగా రాజకీయాల్లోనూ.. పవర్ ప్యాక్డ్ స్టార్ గా సినిమాల్లోనూ కొనసాగే పరిస్థితి ఉందా? రెండు పడవల పయనం పవన్ కి సాధ్యమేనా? అంటూ అభిమానుల్లో నిరంతరం ఆసక్తికర చర్చ సాగుతోంది. తామరతంపరగా సాగుతున్న ప్రచారంలో ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది తేలడం లేదు.
పవన్ ఓవైపు రాజకీయాల్లో పూర్తి బిజీగా ఉండగానే పింక్ రీమేక్ లో నటిస్తున్నారంటూ ప్రచారమవుతోంది. కానీ ఇప్పటివరకూ రీమేక్ నిర్మాతలు దిల్ రాజు- బోనీకపూర్ ఆ సంగతిని అధికారికంగా ప్రకటించేందుకు భయపడుతూనే ఉన్నారు. ఆయన సెట్స్ కొచ్చాకే వచ్చినట్టు! అన్న చందంగా పవన్ పేరును ప్రకటించకుండా దాచేస్తున్నారు. ఈ సైలెన్స్ వెనక లాజిక్ ఏమిటో అర్థం కాని అభిమానులు బుర్రలు పట్టుకుని వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ సన్నివేశం అంతకంతకు వేడెక్కుతోంది. అమరావతి నుంచి రాజధాని విశాఖకు తరలి వెళుతున్న క్రమంలో ఉద్యమాల సన్నివేశం కనిపిస్తోంది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ పార్టీ తరపున ప్రజల కోసం పోరాడకుండా సినిమాల్లో నటిస్తారా? అంటూ ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది.
సరిగ్గా ఇలాంటి టైమ్ లో మరో గుసగుస బయటకు వచ్చింది. పవన్ ఈ నెల 20 నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నారని.. పింక్ రీమేక్ కోసం 20 రోజుల సమయం కేటాయించారని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలోనూ ఆయన నటించనున్నారు. దానికోసం 10 రోజుల సమయం కేటాయించారన్న పుకార్ షికార్ చేస్తోంది. పనిలో పనిగా మైత్రి మూవీ మేకర్స్ వద్ద అడ్వాన్స్ తీసుకున్నారు కాబట్టి వారికి ఓ సినిమా చేస్తారన్న ప్రచారం వేడెక్కిస్తోంది. అయితే ఇలా ఒకదాని వెంట ఒకటిగా మూడు సినిమాలు చేసే వీలుందా? అన్నది పవన్ స్వయంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక పింక్ రీమేక్ తో పాటు .. క్రిష్ సినిమా కోసం 50 కోట్ల మేర ప్యాకేజీ అందుకుంటున్నాడని .. లాభాల్లో వాటా దక్కనుందని కూడా ప్రచారమవుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత? అన్నది క్లారిటీగా తెలియాల్సి ఉంది.