పవన్ నైజం కాస్త భిన్నం. ఆయన్ను అర్థం చేసుకోవటం కష్టం. మనసులు నొచ్చుకుంటాయని మొహమాటపు మాటలు చెప్పటం అస్సలు ఇష్టం ఉండదు. నిజాయితీగా ఉండటమే పవన్ కు తెలిసిన పని. అది కన్నకొడుకు విషయంలో అయినా.. తనను అమితంగా ఆరాధించే ఫ్యాన్స్ విషయంలో అయినా. ఏ తండ్రి అయినా తన కొడుకు పుట్టినరోజు గుర్తు ఉండదని ఓపెన్ గా చెప్పటానికి మొహమాట పడతారు. వీలైనంతవరకూ కవర్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అదే.. మీడియాకు ఇదే విషయాన్ని చెప్పాల్సి వస్తే.. కొడుకు బర్త్ డే తనకు గుర్తుండని వాస్తవాన్ని పక్కన పెట్టేసి.. కొడుకు బర్త్ డే తనకెంత గొప్పన్న విషయాన్ని వీలైనంత ఫాంటసీగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.
అలా చేస్తే ఆయన పవన్ ఎందుకు అవుతారు. మిగిలిన వారికి చాలా భిన్నంగా ఉండే పవన్.. తాజాగా తన మాటలతో చాలామంది ఫ్యాన్స్ ని నిర్ఘాంతపోయేలా చేశారు. పవన్ మాటల్ని జీర్ణించుకోవటం కష్టమే అయినప్పటికీ తన కొడుకు అకీరా పుట్టినరోజు తనకు గుర్తు ఉండదన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టేశాడు. తన కొడుకు పుట్టినరోజును దృష్టిలో పెట్టుకొనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను రిలీజ్ చేశారన్న ప్రచారాన్ని పూర్తిగా కొట్టేసిన ఆయన.. అకీరా పుట్టినరోజు తనకు అస్సలు గుర్తే లేదని చెప్పేశాడు.
పిల్లల పుట్టినరోజులు.. వారు చదివే చదువులు లాంటివి తనకు గుర్తు ఉండవని చెప్పిన పవన్.. తానంటే అకీరాకు చాలా ఇష్టమని.. వాడు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటున్నాడన్న సంతోషం ఉన్నా.. తన దగ్గర లేదనే బాధ ఉందని చెప్పుకొచ్చాడు. అకీరా అలిగాడని.. తనకు దూరంగా ఉండటం వాడికి బాధ ఉన్నప్పటికీ.. తన స్టార్ ఇమేజ్ కు దూరంగా ఉండటం మంచిదని చెప్పుకొచ్చాడు.
తన నట వారసుడిగా అకీరా లాంటివి తనకు అస్సలు నచ్చవని.. అతడికి నచ్చింది ఏదైతే అదే చేస్తాడని చెప్పాడు. పుట్టిన రోజున విష్ చేయలేదని.. ఆదివారం వెళ్లాల్సి ఉందని.. టిక్కెట్లు బుక్ చేసుకున్నా కుదర్లేదని.. మంగళవారం కొడుకు దగ్గరకు వెళుతున్నట్లు చెప్పాడు. చేసేది తప్పా? ఒప్పా? అన్నది పక్కన పెడితే.. తానేం చేస్తాడో.. అదే విషయాన్ని ఓపెన్ గా చెప్పేయటం పవన్ లాంటి వాళ్లకే సాధ్యమవుతుందేమో..?