పవన్ టీవీ ఎంట్రీ.. కథ కంచికేనా?

Update: 2016-07-26 05:08 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ నుంచి తొందరగానే బయటపడ్డాడు. కేవలం 4 నెలల గ్యాప్ తో కొత్త సినిమా మొదలుపెట్టేస్తున్నాడు. మరో 10 రోజుల్లో డాలీ డైరెక్షన్ లో రూపొందనున్న కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది కూడా. అయితే.. కొన్ని రోజుల క్రితం బుల్లితెరపై పవన్ ఓ స్పెషల్ షో చేయనున్నాడంటూ ప్రచారం బాగానే జరిగింది.

ఈటీవీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ హోస్ట్ గా.. ఓ కొత్త కాన్సెప్ట్ తో షో చేస్తారనే టాక్ నడిచింది. దానికి సాక్ష్యంగా ఆ టెలివిజన్ నిర్వహించిన పలు కార్యక్రమాలకు పవన్ హాజరయ్యాడు కూడా. అయితే ఈ ప్రాజెక్టు అటకెక్కేసిందని తెలుస్తోంది. హిందీలో అమీర్ ఖాన్ నిర్వహించిన సత్యమేవ జయతే టైపులో పవన్ తో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు ఈ ఛానల్ ప్రయత్నించిందని.. అందుకు తగినట్లుగా మాటలు కూడా నడిచినా.. ఇప్పుడీ ప్రాజక్టు పట్టాలెక్కే అవకాశం లేదని అంటున్నారు.

ప్రస్తుతం పవన్ త్వరత్వరగా తన సినిమాలు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుండడం.. మరోవైపు జనసేనకు సంబంధించిన ఏర్పాట్లను నడిపిస్తూ ఉండడంతో.. టీవీ ప్రోగ్రామ్ షూటింగ్ సాధ్యం కాదని అంటున్నారు. మరోవైపు ఆ ఛానల్ కూడా ఈ కార్యక్రమంపై వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News