ఇప్పుడు రంగంలోకి ఎందుకు పవన్‌?

Update: 2016-04-11 13:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా మీడియాకి చాలా అంటే చాలా దూరంగా ఉంటాడు. తన సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఎలాంటి ప్రచారం చేయకపోవడం, పవన్ కి అలవాటు. ఇప్పటివరకూ పవన్ సాధించిన రికార్డులన్నీ ఈ బాపతువే. తనే స్వయంగా రంగంలోకి దిగి సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ సహజంగానే వ్యతిరేకి. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ కోసం ఈ పద్ధతిని పక్కన పెట్టాల్సి వచ్చింది.

ఉగాది రిలీజ్ అయిన ఈ మూవీకోసం - రెండు రోజుల వరకూ నోరు మెదపలేదు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు మీడియాని దూరం పెడుతున్నాడనే విమర్శల నుంచి తప్పించుకోవడానికి వాళ్లకి కూడా ముఖాముఖిలు ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్. సండే రోజున పవన్ చేసిన సందడి, అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ పవన్ రంగంలోకి దిగేసరిగే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

ఇదే ప్రచారం జస్ట్ మూడ్రోజుల ముందు.. అంటే మూవీ విడుదలకు ఒక రోజున చేసి ఉన్నా.. పరిస్థితి వేరుగా ఉండేది. ఓపెనింగ్స్ ఇంకా ఎక్కువగా ఉండడమేకాదు.. వీకెండ్స్ వరకూ కలెక్షన్స్ కి ఢోకా ఉండేది కాదు. టాక్ స్ప్రెడ్ అయ్యాక, వీకెండ్ ముగిసిపోయాక... పవన్ ఎంత ప్రచారం చేసినా సినిమాకి వచ్చే ప్రయోజనం ఉండదనే చెప్పాలి. పబ్లిసిటీ విషయంలో ఈ సారి జరిగిన తప్పుని.. నెక్ట్స్ టైం అయినా పవన్ దిద్దుకుంటాడని ఆశిద్దాం.
Tags:    

Similar News