ట్రెండ్‌ ఫాలో అయిన పవన్‌

Update: 2016-03-24 22:30 GMT
పవన్‌ కళ్యాన్‌ ట్రెండ్‌ ఫాలో అవ్వడు.. సెట్‌ చేస్తాడు. కాకపోతే ఈసారి హాలీవుడ్‌ లో వాడుకలో ఉన్న ట్రెండ్‌ ఫాలో అయ్యి.. దాని టాలీవుడ్‌ కు కొత్తగా సెట్‌ చేశానంటున్నాడు.

సర్దార్‌ సినిమా స్ర్కిప్టు రాసిన తరువాత.. క్యారెక్టర్‌ లుక్ ఇలా ఉండాలి అంటూ పవన్‌ స్కెచ్చింగ్‌ చేశాడట. దానిని బేస్‌ చేసుకుని.. ఒక స్టోరీ బోర్డ్‌ ఆర్టిస్ట్‌ సదరు సీన్లను డ్రా చేసి.. వాటిని యానిమేట్‌ కూడా చేశారట. దానితో ఒక సీన్‌ లెంగ్త్‌ ఎంత ఉండాలి.. ఎంతుంటే మనకు ఎమోషన్‌ వర్కవుట్‌ అవుతుంది అనే విషయం ముందే తెలిసిపోతుంది. సర్దార్‌ సినిమాలో కీలకమైన యాక్షన్‌ సీన్లకు.. పాటలకు.. ఈ స్టోరీ బోర్డును వేయించి.. దాని సహాయంతో ప్రొడక్షన్‌ టైములో అస్సలు టైము వేస్టు కాకుండా షూటింగ్‌ పూర్తి చేయించారట పవన్‌. ఇదంతా కరక్టే కాని.. ఇవన్నీ పవన్‌ చేస్తుంటే మరి దర్శకుడు బాబీ ఏం చేసినట్లు?

సర్లేండి. కాకపోతే ఈ ట్రెండ్‌ తెచ్చిన ఘనతను మనం కేవలం పవన్‌ కే కట్టిపెట్టలేం. ఎందుకంటే ఛత్రపతి సినిమా నుండే ఇలా స్టోరీ బోర్డులు వేయించి.. ప్రీ-విజువలైజేషన్‌ చేయించి.. అప్పుడు షూటింగ్‌ చేసేవాడు రాజమౌళి. మరి ఈసారికి హాలీవుడ్‌ అండ్‌ రాజమౌళి ట్రెండ్‌ ను పవన్‌ ఫాలో అయినట్లే.
Tags:    

Similar News