తెలిసిన కథ రాయటానికి రెండున్నరేళ్లా పవన్?

Update: 2016-04-12 07:30 GMT
ఇంటర్వ్యూలు ఇచ్చే అలవాటు లేని పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల నేపథ్యంలో ఎంపిక చేసిన మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక ప్రముఖ వార్తా ఛానల్ కు పవన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సదరు ఛానల్ సీఈవో నే స్వయంగా పవన్ ను ఇంటర్వ్యూ చేయటం ఆసక్తికరంగా మారింది. చాలా అరుదుగా మాత్రమే టీవీ స్ర్కీన్ మీద కనిపించే సదరు టీవీ ఛానల్ సీఈవోనే పవన్ ను ఇంటర్వ్యూ చేయటం ఒక ఎత్తు అయితే ఆయన వేసిన.. కొన్ని ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఆయన వేసిన ఒక ప్రశ్న.. సర్దార్ గబ్బర్ సింగ్ కథ గురించి. సర్దార్ గబ్బర్ సింగ్ కథలో కొత్తదనం లేదని.. మూసపోత కథనే రాశారు? అన్న ప్రశ్నకు పవన్ కల్యాణ్ చెప్పిన సమాధానం.. మూసపోత కథ కాదని.. అది అందరికి తెలిసిన కథనే తాను రాశానని చెప్పారు. పవన్ మాట విన్న వెంటనే.. మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది. నిజానికి ఈ ప్రశ్నను ఇంటర్వ్యూ చేసిన ఛానల్ సీఈవో అడిగి ఉండాల్సింది. కానీ.. ఆయన ఆ పని చేయలేదు.

ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే.. అందరికి తెలిసిన కథను రాయటానికి పవన్ కు రెండున్నరేళ్లు ఎందుకు పట్టిందని? కొత్తగా లేని కథ.. అందరికి తెలిసిన కథ రాయటానికి పవన్ కు రెండున్నరేళ్లు పట్టటం ఏమిటన్న ప్రశ్న తలెత్తక మానదు. కొన్ని పరిమితులతో ఉండే కథను రాయాల్సి వచ్చినప్పుడు అందరికి తెలిసిన కథనే తాను రాశానని.. నిజానికి అదో చందమామ కథగా పవన్ అభివర్ణించారు. మరి.. చందమామ కథను రాయటానికి పవన్ కు రెండున్నరేళ్లు పట్టటం ఏమిటో..?
Tags:    

Similar News