''ఏదో మేం చిన్న ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటున్నాం అంటే.. వంద ప్రశ్నలు అడుగుతారు. ఎన్నో విచారించాక కాని అసలు పర్మిషన్ అనేది ఇవ్వరు. అటువంటిది ఒక కాపు గర్జన జరుగుతుంటే.. అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనికి తెలుగుదేశం ప్రభుత్వానిదే బాధ్యత'' అంటూ ఎద్దేవా చేశారు జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే అటు కాపు యువత కూడా హింసాత్మక రూట్ పట్టకూడదని - సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉండొచ్చేమోనని ఆయన డౌటు వ్యక్తం చేశారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో.. పవన్ కళ్యాణ్ ఒక ఆడియో ఫంక్షన్ గురించి ప్రస్తావించడం.. అలాగే ఆయన సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కోసం నిన్న ఉదయమే కేరళ వెళ్ళిన నేను.. ఈ కాపు గర్జన హింసాత్మకంగా మారడం తో తిరిగొచ్చానని చెప్పడం.. సినిమా లవర్లను టచ్ చేస్తోంది. ఆయన ఎంత పెద్ద పొలిటికల్ పార్టీ పెట్టినా.. సినిమా స్టారే అనే విషయం గుర్తుచేస్తోంది. ఎప్పుడైతే ఆడియో ఈవెంట్ల గురించి పవన్ కంపేర్ చేశారో.. అలాగే సర్దార్ షూటింగ్ మధ్యలో ఆపేసి వచ్చానని చెప్పారో.. అప్పుడు ఆయన సినిమా మనిషి అని అర్దమైంది. అది సరే.. మరి ఇలా అర్దంతరంగా ''సర్దార్ గబ్బర్ సింగ్'' షూటింగ్ ఆపేసి వచ్చేస్తే.. సినిమా ఏప్రిల్ లో విడుదలవుతుందా సర్దార్??
పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రెస్ మీటు పెడుతున్నారంటే చాలు.. అసలు ఆయన తదుపరి సినిమా పరిస్థితి ఏంటో అంటూ మూవీ లవర్స్ కు భయం వేస్తోంది. అది సంగతి.