విమ‌ర్శ‌ల‌పై లాయ‌ర్ సాబ్ రియాక్ష‌న్?

Update: 2020-01-31 06:55 GMT
జ‌న‌సేనాని.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్కసారిగా సినిమాలతో బిజీ అయిపోయారు. వ‌రుస‌గా రెండు సినిమాలను ప‌ట్టాలెక్కించి అభిమానుల‌కు ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. వేణు శ్రీరామ్ దర్శ‌కత్వంలో లాయ‌ర్ సాబ్... క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో పీఎస్‌.పీకే 27 సినిమాని ప్రారంభించేసి.. ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఉంద‌ని సిగ్న‌ల్ ఇచ్చేశాడు. వీలైనంత త్వ‌ర‌గా చిత్రీక‌ర‌ణలు పూర్తిచేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ లో ఉన్నారు. దీనిలో భాగంగా ప‌వ‌న్ నంచి ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌కు స్ట్రిక్టుగా ఆదేశాలు జారీ అయ్యాయి. తాను ఇచ్చిన షెడ్యూల్ లో ఎట్టి ప‌రిస్థితుల్లో త‌న‌కు సంబంధించిన ప‌నుల‌న్నింటిని పూర్తిచేయాల‌ని ఆదేశాలిచ్చారు. దీంతో రెండు సినిమా యూనిట్లు అదే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. అలాగే ముచ్చ‌ట‌గా మూడ‌వ సినిమా కూడా క‌మిట్ అయిన‌ట్లు తాజాగా మ‌రో వార్త వేడెక్కిస్తుంది.

సైరా న‌ర‌సింహారెడ్డి ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి వినిపించిన ఓ హిస్టారిక‌ల్ ల‌న్ కు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. దీంతో ప‌వ‌న్ అభిమానులు డబుల్ ఖుషీ అయి పోతున్నారు.ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే జ‌న‌సేనాని గా ప్ర‌జ‌ల్లోకి వెళుతున్న ఆయ‌న రాజ‌కీయాల్లో ఎంత వ‌ర‌కూ న్యాయం చేయ‌గ‌ల‌డు? అన్న దానిపైనే ఇప్పుడు విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. విశాఖ కాకినాడ స‌భ‌ల్లో మ‌ళ్లీ సినిమాలు చేయ‌న‌ని...ప్ర‌జ‌ల‌కే త‌న రాజ‌కీయ జీవితం అంకితం అని వాగ్ధానం చేసారు. కానీ ఆయ‌న సినిమా కమిట్ మెంట్ల‌ను బ‌ట్టి ఆ వాగ్ధానం గాల్లోనే క‌లిసిపోయిన‌ట్టేనా? అంటూ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఈ కార‌ణంగానే జ‌న‌సేన కీల‌క నేత జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీకి నిన్న‌నే గుడ్ బె చెప్పేసారు. ఈ నేప‌థ్యంలో ఓ వ‌ర్గంలో ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలిపై తీవ్ర‌ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అప్ప‌టివ‌ర‌కూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ కు మ‌ద్ద‌తిచ్చిన వారంతా జేడీ నిర్ణ‌యంలో త‌ప్పేమీ లేదంటూ త‌మ అభిప్రాయాన్ని చెప్పేందుకు వెన‌కాడ‌డం లేదు. ప‌వ‌న్ వ్య‌వ‌హార‌శైలి...ఆయ‌న తీరు పై అస‌హ‌నం వ్య‌క్తం అవుతోంది. రాజ‌ధాని రైతుల పై హ‌డావుడి చేసిన ప‌వ‌న్ ఒక్క‌సారిగా ఎందుకు చ‌ల్ల‌బ‌డిన‌ట్లు? వ‌రుస‌గా సినిమాలు ఎందుకు కమిట్ అవుతున్న‌ట్లు? అంటూ ఆరాల‌తో కూడిన విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మ‌రి వీటిపై జ‌న‌సేనాని రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News