పవన్ అదనంగా మరో పది కోట్లు తీసుకుంటున్నాడా..?

Update: 2021-09-08 03:00 GMT
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్.. 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే 'వకీల్ సాబ్' సినిమాతో సాలిడ్ రీఎంట్రీ ఇచ్చిన బాక్సాఫీస్ కు తన స్టామినా ఏంటో మరోసారి గుర్తు చేశాడు. కరోనా పాండమిక్ సమయంలో విడుదల అవడం వల్ల కలెక్షన్స్ కాస్త తగ్గినప్పటికీ.. ఈ సినిమా మేకర్స్ కి ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్‌ గా తీసుకున్నాడని టాక్ ఉంది.

'వకీల్ సాబ్' తో కంబ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వస్తూనే మరో ఐదు చిత్రాలను లైన్ లో పెట్టారు. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఒక ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగానే మరో సినిమా షూటింగ్ ప్రారంభించి.. ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన చిత్రీకరణలో పాల్గొంటూ వస్తున్నారు. ప్రస్తుతం 'భీమ్లా నాయక్' షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. వచ్చే నెలలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే 'హరి హర వీరమల్లు' చిత్రీకరణను తిరిగి ప్రారంభిస్తారు. ఈ క్రమంలో హరీష్ శంకర్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ - డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న PSPK28 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా కోసం పవన్ తన పారితోషికాన్ని పెంచేసాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కు అదనంగా మరో రూ.10 కోట్లు కలిపి, మొత్తంగా రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ని హ్యండిల్ చేస్తున్న మైత్రీ టీమ్.. పవన్ కల్యాణ్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఈ నేపథ్యంలో పవన్ #PSPK28 కోసం బల్క్ డేట్లను కేటాయిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసిన హరీష్ శంకర్.. పవన్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకున్నట్లు టాక్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా.. చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు.
Tags:    

Similar News