నైజాం విషయంలో ఈసారి ''సర్దార్ గబ్బర్ సింగ్'' పెద్ద పనే పెట్టేశాడు. అది ఏ రేంజులో అంటే.. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం.. ఈ సినిమాను నైజాంలో ఏకంగా 20 కోట్లకు అమ్మేశారట. ఇంద్ర ఫిలింస్ వారు ఈ సినిమాను ఈరోస్ దగ్గర నుండి కొనుకున్నారు. అయితే ఇంత మొత్తం ''షేర్'' రూపంలో బాక్సాఫీస్ దగ్గర నుండి వసూలు చేయాలంటే ఎంత కష్టపడాలో తెలుసా??
నిజానికి బాహుబలి తరువాత నైజాంలో అంత ఎక్కువగా వసూలు చేసిన సినిమా అంటూ అందరూ రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు కాని.. అసలు ఈ 20 కోట్లు వసూలు చేయాలంటే.. పవన్ మరోసారి ఇండస్ర్టీ హిట్ కొట్టాలనే విషయం గమనించట్లేదు. ఎందుకంటే ఆ రేంజు హిట్టయిన అత్తారింటికి దారేది సినిమా ఒక్కటే పవన్ కెరియర్ లో నైజాం నుండి 22.5+ కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు మరోసారి అలాంటి హిట్ కొడితేనే అక్కడి పంపిణీదారుడికి ప్రాఫిట్. ఇక గబ్బర్ సింగ్ తొలి పార్టు కూడా నైజాంలో 19.5 కోట్లు షేర్ మాత్రమే తెచ్చింది. మరి ఈ ఫిగర్లను బట్టి చూస్తుంటే.. ఖచ్చితంగా పవన్ మరోసారి అతి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. వేరే ఆప్షనే లేదు.