పవన్ చూపు.. మలయాళం వైపు..

Update: 2016-05-01 04:15 GMT
సినిమా రంగంలో చాలా రకాల సెంటిమెంట్స్ ఉంటాయ్. వీటికి ఏ స్టార్ అయినా ఫాలో అయిపోవాల్సిందే. సాధారణంగా ఇలాంటి వాటిని పట్టించుకోడనే పేరున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడో సెంటిమెంట్ కి ఫిక్స్ అయ్యాడంటున్నారు. తన సినిమాల్లో హీరోయిన్ గా నార్త్ భామలు అచ్చిరాలేదని అనుకుంటున్నాడట పవన్.

పవన్ కళ్యాణ్ కి రీసెంట్ గా ఇచ్చిన రెండు బ్లాక్ బస్టర్స్ లోను సౌత్ హీరోయిన్లే నటించారు. గబ్బర్ సింగ్ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా.. అత్తారింటికి దారేది మూవీలో సమంత యాక్ట్ చేసింది. వీళ్లద్దరూ చెన్నై బ్యూటీలే కావడం విశేషం. అంటే పవన్ కి సక్సెస్ ఇచ్చినది సౌత్ భామలే అన్నమాట. రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ లో ముంబై భామ కాజల్ అగర్వాల్ నటించింది.

అందుకే ఇప్పుడు ఎస్ జే సూర్యతో చేయనున్న సినిమాలో ఓ మలయాళీ హీరోయిన్ ను తీసుకోవాలని చూస్తున్నాడట పవన్. ప్రస్తుతం మల్లూ భామలకు క్రేజ్ పెరగడం కూడా ఇందుకు కారణం అంటున్నారు. పలువురు హీరోయిన్ల ప్రొఫైల్స్ పరిశీలించినా.. పార్వతీ పరమేశ్వరన్ పేరును బాగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈమెతో ఓ ఓ ఫోటో సెషన్ కూడా కంప్లీట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. హుషారు అనే వర్కింగ్ టైటిల్ పై ఈ మూవీ తెరకెక్కనుంది
Tags:    

Similar News