ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు చూడండి.. ఎప్పుడూ కూడా తన అభిమానులను.. మిత్రులనూ.. తన గిఫ్టులతో థ్రిల్ చేస్తుంటాడు. గిఫ్టులంటే ఇక్కడ ఏదో ఫ్యాన్సీ ఐటెమ్స్ కాదండోయ్.. మనోడు కేవలం న్యాచురల్ అండ్ సింపుల్ థింగ్స్ మాత్రమే పంపిస్తాడు. ఇప్పటికే ఇండస్ర్టీలో చాలామంది పవన్ ఫామ్ లో పండిన మామిడిపళ్ళను తిన్న సంగతి తెలిసిందే. వారికి ప్రతీ ఏడాది ఈయన దగ్గర నుండి మామడిపళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు కొందరు అభిమానులకు అదే విధంగా పుస్తకాలు వచ్చేస్తున్నాయి తెలుసా!!
మొన్న పవన్ అమెరికా టూర్ వెళ్ళినప్పుడు అక్కడి ఎన్నారై అభిమానులు కొందరు.. పవన్ కోసం వందల కార్లలో ర్యాలీగా వచ్చారు. న్యాష్ విల్ అనే టౌన్ నుండి ఈ ర్యాలీ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు పవన్ అక్కడ ర్యాలీలో పాల్గొన్న అభిమానులందరికీ.. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని తను స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి మరీ పంపేశాడు. ప్రస్తుతం మనోడు ఇటలీలో షూటింగులో ఉండగా.. ఈయన పంపిన పుస్తకాలు అందుకున్న అమెరికా ఎన్నారైలు ఉబ్బితబ్బిబైపోతున్నారు.
గతంలో అసలు ఆధునిక మహాభారతం పుస్తకం అచ్చు కాపీలు మార్కెట్లో కనుమరుగైపోతున్న సమయంలో.. పవన్ కళ్యాణ్ స్వయంగా డబ్బులు వెచ్చింది ఈ పుస్తకం ప్రతులను ప్రింటింగ్ చేయించిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/