ట్రైలర్ తెలీదు.. ఆ పాట మాత్రం ఉంది

Update: 2017-12-20 04:37 GMT
ఇప్పుడు అన్నింటికంటే పెద్ద సందేహం ఏంటంటే.. గత రాత్రి అంత వైభవంగా అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ జరిగింది కాని.. అసలు ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. అదే విధంగా.. పవన్ కళ్యాణ్‌ స్వయంగా పాడిన ఒక పాట సంగతి కూడా ఏమీ చెప్పలేదు. దీని గురించి ఇప్పుడు ఒక అప్డేట్ వినిపిస్తోంది.

'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్ కళ్యాణ్‌ మరోసారి ఒక గానాలాపన చేశారు. గతంలో కాటమరాయుడా కదరి నరసింహుడా అంటూ పాట పాడిన పవన్.. ఇప్పుడు కూడా కొడకా కోటేశ్వర్రావా అంటూ సాగే పాట పాడారని టాక్. అయితే ఆయన పాడింది ఏ లిరిక్ అనేది తెలియదు కాని.. ఆయన పాడిన పాట మాత్రం డిసెంబర్ 31న న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేస్తారట. అయితే ట్రైలర్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కాని.. 25న క్రిస్మస్ సందర్భంగా ఆ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని ముందు నుండి వినిపిస్తున్నా టాకే సుమీ.

ఇకపోతే ప్రస్తుతానికి సాంగ్స్ తాలూకు విజువల్స్ ను కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. కాని రానున్న రోజుల్లో మేకింగ్ వీడియోలతోపాటు సాంగ్ విజువల్స్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తారని తెలుస్తోంది. జనవరి 10న అజ్ఞాతవాసి రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News