పవన్‌ కొడుక్కి సైకిల్‌ యాక్సిడెంట్‌

Update: 2016-05-09 06:50 GMT
అవును. చిన్నప్పుడు సైకిల్‌ నేర్చుకుంటుంటే.. పిల్లలు ఎవరికైనా కూడా దెబ్బలు తగలడం సహజమే. కిందపడి కాళ్ళు గీరు కోవడం నుండి.. చేతులు కొట్టుకుపోవడం వంటివి కామన్‌. ఒక్కోసారి కాళ్ళూ చేతులూ విరుగుతాయి కూడా. ఇక పవన్‌ కళ్యాణ్‌ కొడుకు అకీరా నందన్‌ కు కూడా అలాంటి యాక్సిడెంట్‌ ఒకటి జరిగిందని తెలుస్తోంది.

పూణె నగరంలో తన తల్లి రేణు దేశాయ్‌ తో ఉంటున్న అకీరా.. సైకిల్‌ నేర్చుకుంటుండగా చిన్నపాటి ప్రమాదానికి గురై.. బాగా దెబ్బలు తగిలించుకుంటున్నాడు. అయితే అతనికి వైద్యం చేయిద్దామని ఒక ప్రముఖ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ కు తీసుకెళ్తే మాత్రం.. అక్కడ డాక్టర్లూ.. నర్సులూ.. సకాలంలో స్పందించకుండా ఏడిపిస్తున్నారంటూ రేణు దేశాయ్‌ మొత్తుకుంది. ''పెద్ద పెద్ద ఆసుపత్రులకు ట్రీట్మెంట్‌ కోసం వెళ్లే బదులు.. డైరక్టుగా చచ్చిపోవడమే బెటర్‌. ఈ డాక్టర్ల నర్సుల నిర్లక్ష్యం మనలోని మానవత్వాన్ని పూర్తిగా చంపేస్తుంది. దెబ్బలు తగిలిన పిల్లాడిని చూస్తూ కూడా.. వీరు ట్రీట్మెంట్‌ ఇవ్వడానికి నిర్లక్ష్యం ఎందుకో తెలియట్లేదు'' అంటూ చెప్పుకొచ్చింది.

జరిగిన యాక్సిడెంట్‌ నుండి అకీరా త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు పవన్‌ ఫ్యాన్స్‌.
Tags:    

Similar News