సర్దార్ ఆడియో: హీరోయిన్స్, ఆలీ పై పవన్

Update: 2016-03-20 17:55 GMT
పవర్ స్టార్ మాట్లాడుతుంటే.. వినేందుకు, చూసేందుకు చాలా ముచ్చటగా ఉంటుంది. కొంచెం మొహమాటంగా, కొంచెం సిగ్గు పడుతూ భలే మాట్లాడుతూ ఉంటాడు. అలాంటిది అమ్మాయిల గురించి మాట్లాడాల్సి వస్తే ఇంకా సిగ్గు పడిపోతాడు పవన్ కళ్యాణ్. తన స్పీచ్ లో భాగంగా.. తన టెక్నీషియన్స్ - యాక్టర్స్ కు కృతజ్ఞతలు చెప్పిన పవన్.. అమ్మాయిల గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు.

ప్రతీ ఒక్కరినీ గౌరవంగా ముఖ్యంగా హీరోయిన్స్ తన కంటే చిన్నవాళ్లైనా.. గారు అని సంబోధిస్తూ తన ప్రత్యేకత చాటుకున్నాడు. హీరోయిన్ కాజల్ గారు చాలా అందంగా ఉన్నారని.. ఆమె పెర్ఫామెన్స్ చాలా చక్కగా చేశారని పొగిడాడు పవన్. అలాగే విలన్ కి జోడీగా నటించిన సంజన గారి కృతజ్ఞతలు అన్నాడు పనవ్. 'మీరు ట్రైలర్ లో ఇద్దరు అమ్మాయిలను చూశారు... వారి పేర్లు అశ్విని, పూజ' అని చెప్పాడు పవన్.

అంతలోనే ' ఎంతసేపూ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావ్, నా గురించి మాట్లాడ్డం లేదు అని ఆలీ గారు నావంక సీరియస్ గా చూస్తున్నారు' అంటూ నవ్వులు పూయించిన పవన్.. ఆలీ లేకపోతే తనకు లోటుగా ఉంటుంది. అందుకే ఏదోలా పెట్టుకుంటానని చెప్పాడు. ఆలీ గారికి కూడా అని పవన్ అంటే.. ఆలీ ఫీలింగ్ అదుర్స్ అని చెప్పాలి.
Tags:    

Similar News