పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి అయ్యింది. మరో వైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఆ మధ్య సినిమా క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చినా దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ తప్పకుండా మా సినిమా ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా ఉండే అవకాశం ఉంది. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఆ విషయం పక్కన పెడితే తమిళ సినిమా వినోదయ్య సిత్తం ను సముద్ర ఖని దర్శకత్వంలో రీమేక్ చేసేందుకు పవన్ ఓకే చెప్పాడు. పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ లు ఆ రీమేక్ లో కలిసి నటించబోతున్నారు.
ఇన్ని సినిమాలు లైన్ లో ఉండగా సాహో దర్శకుడు సుజీత్ కి ఈయన ఓకే చెప్పాడు అంటూ విశ్వసనీయంగా సమాచారం అందుతోంది. గతంలో తేరీ సినిమాను రీమేక్ చేయాలి అనుకున్న సమయంలో సుజీత్ పేరును పరిశీలించారు. సుజీత్ కూడా పవన్ కోసం ఆ రీమేక్ చేసేందుకు ముందుకు వచ్చారంటూ వార్తలు వచ్చాయి.
ఇప్పుడు పవన్ తో సుజీత్ ఒరిజినల్ కథతో సినిమా ను రూపొందించబోతున్నట్లు గా తెలుస్తోంది. సాహో సినిమా తో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన ఈ యువ దర్శకుడికి పవన్ నుండి హామీ వచ్చిందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడట.
ఈ సినిమా నిర్మాణం ను మరీ ఆలస్యం చేయకుండా రాబోయే నెల రోజుల్లోనే మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే యాత్ర ను కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
నెలల పాటు పర్యటన ఉంటుంది. దాంతో ఎలా వరుసగా సినిమాలు చేస్తాడు అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ప్రకటనతో పండగ చేసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.