గత కొంతకాలంగా మెగా సోదరులు ఇద్దరికీ పడ్డం లేదని చాలా టాక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య విబేధాలు తలెత్తాయని, అందుకే మెగా ఫంక్షన్ లకు పవన్ దూరంగా ఉంటున్నారనే వాదనలు ఉన్నాయి. ఇలా తమ మధ్య వివాదాలు ఉన్నాయనే రూమర్స్ కు ఒక్క సీన్ తోనే చెక్ పెట్టేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమైపోయారని తెలుస్తోంది.
ఇంద్ర మూవీలో చిరు వేసిన వీణ స్టెప్ ను సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ వేయనున్నారనే విషయం గతంలోనే తుపాకి చెప్పేసింది. ఇప్పుడా సన్నివేశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలిశాయి. గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి టైప్ లోనే, సర్దార్ లో ఓ పేద్ద సీక్వెన్స్ ఉంటుంది. దీనిలో అన్ని చిరంజీవి పాటలు - డ్యాన్సులు - డైలాగ్సే ఉంటాయి. చిరు గతంలో వేసిన అనేక సిగ్నేచర్ స్టెప్స్ ని పవన్ మక్కీకి మక్కీ దించేయనున్నారు. ఇందుకోసం స్పెషల్ గా డ్యాన్స్ మాస్టర్ ను కూడా సెట్ చేసుకున్నారు.
ఇక చిరు గతంలో చెప్పిన పంచ్ డైలాగ్స్ కూడా ఈ సీన్ లో చెప్పనున్నారు పవన్. ఈ సన్నివేశం ద్వారా తనకు చిరంజీవి అంటే ఎంత గౌరవం ఉందో ఇన్ డైరెక్టుగా చెప్పేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ సీన్ తర్వాత చిరు-పవన్ ల మధ్య విబేధాలు ఉన్నాయనే మాట ఇక వినిపించకపోవన్నది సర్దార్ యూనిట్ నుంచి వస్తోంది.