ప్రిన్సెస్ తో సర్దార్ ఆటా పాటా

Update: 2016-03-30 05:15 GMT
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి సంబంధించి టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు స్విట్జర్లాండ్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అక్కడ నాలుగు రోజుల షెడ్యూల్ లో భాగంగా రెండు పాటలను తెరకెక్కించారు. ఈ రెండు పాటల్లోనూ పవర్ స్టార్ తో పాటు హీరోయిన్ కాజల్ కూడా డ్యాన్స్ లు చేసింది.

స్విట్జర్లాండ్ లోని ఇంటర్ లేకన్ సిటీ సమీపంలో జుంగ్ ఫ్రూ అనే కొండలు చాలా ప్రఖ్యాతి చెందాయి. ఆ దేశంలో ఇది అతి పెద్ద టూరిస్ట్ స్పాట్ కూడా. ఇక్కడే సర్దార్ పాటలను చిత్రీకరించారు. డైరెక్టర్ బాబి కూడా లేకుండానే.. ఈ పాటల పిక్చరైజేషన్ పూర్తి చేసేయడం విశేషం. ఈ రెండు పాటల్లోనూ పవన్ స్టెప్పులు, కాజల్ అందాలతో పాటు.. స్విట్జర్లాండ్ లోని జుంగ్ ఫ్రూ శిఖరాల అందాలు ఆడియన్స్ ను అలరిస్తాయని అంటున్నారు.

పాటల షూటింగ్ పూర్తయిపోయిన తర్వాత సర్దార్ లో ప్రిన్సెస్ గా నటిస్తున్న కాజల్ తో.. మన గబ్బర్ సింగ్ తన స్టైల్ లో ఓ ఫోటో దిగాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఉన్న డైరెక్టర్ బాబీ.. ఫస్ట్ కాపీని సిద్ధం చేసేందుకు ఎడిటింగ్ టేబుల్ దగ్గర బాగా యాక్టివ్ గా ఉన్నాడని తెలుస్తోంది. ఈ రెండు పాటలను కూడా యాడ్ చేసేసి... నెలాఖరు కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసేయాలన్నది సర్దార్ టీం టార్గెట్. ఏప్రిల్ 2న సెన్సార్ కంప్లీట్ చేసేందుకు నిర్మాత శరత్ మరార్ సిద్ధమవుతున్నాడు.
Tags:    

Similar News