పవన్ ఫ్యాన్స్ కు మరో కిక్కిచ్చే రీ రిలీజ్

Update: 2023-01-02 03:48 GMT
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన పాత సినిమాలు కూడా మళ్లీ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఇటీవల జల్సా సినిమాతోనే అర్థమైంది. ఆ సినిమానే అత్యధిక స్థాయిలో రికార్డులు అందుకుంది అంటే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో ఖుషి సినిమా అంతకుమించి అనేలా కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ ఉండడం విశేషం.

అయితే ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన మరికొన్ని సినిమాలు కూడా మళ్లీ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అందులో తొలిప్రేమ కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. అది కూడా కరెక్ట్ టైం చూసుకుని విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలిప్రేమ సినిమా 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వన్ సైడ్ లవర్ గా కనిపించిన విధానం అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా సినిమాలో క్యూట్ లవ్ స్టోరీ తో పాటు మంచి కామెడీ సన్నివేశాలు మ్యూజిక్ కూడా ఇప్పటికీ ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టవు. అయితే అలాంటి మంచి మెలోడీ లవ్ డ్రామా వెండి తెరపై చూడాలి అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తోంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో పెరుగుతున్న బజ్ చూసి డిస్ట్రిబ్యూటర్స్ తొలిప్రేమ సినిమాను కరెక్ట్ గా వాలెంటెన్స్ డే టైమ్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. 2023 ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 14న టార్గెట్ చేస్తూ తొలిప్రేమను మళ్ళీ హై క్వాలిటీ తో విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం పవన్ అయితే హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఈ ఏడాది మీడ్ లో వచ్చే అవకాశం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News