పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. జనసేన పార్టీ కార్యకలాపాలల్లో పవన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్ననేపథ్యంలో తను చేయాల్సిన చాలా సినిమాలు, రీమేక్ మూవీస్ వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. 'భీమ్లానాయక్' తరువాత గత కొన్ని నెలలుగా షూటింగ్ లకు దూరంగా వుంటుండటంతో స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీరమల్లు' కూడా గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది.
అయితే ఇటీవల జనసేన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా వైజగ్ వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మూడు పెళ్లిళ్లు, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ ఘాటుగా స్పందించారు. దీంతో ఏపీలో పవన్ వ్యాఖ్యల కారణంగా రాజకీయ వేడి రాజుకుంది.
ఈ నేపథ్యంలో తిరిగి హైదరాబాద్ చేరుకున్న పవన్ కల్యాణ్ గత కొన్ని నెలలగా వాయిదా పడుతున్న 'హరి హర వీరమల్లు ' తదుపరి షెడ్యూల్ ని అక్టోబర్ 17 నుంచి మొదలు పెట్టాలనుకున్నారట.
కానీ పవన్ తాజా వ్యాఖ్యల తరువాత ఏపీలో రాజకీయ వేడి మొదలైంది. దీంతో ఈ మూవీ షూటింగ్ ని మళ్లీ పవన్ హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో 'హరి హర వీరమల్లు' తాజా షెడ్యూల్ నవంబర్ ఫస్ట్ వీక్ లో మొదలయ్యే అవకాశం వుందని చెబుతున్నారు.
కానీ అది ఎంత వరకు నిజం అనే విషయంలో మాత్రం మేకర్స్ నుంచి కూడా క్లారిటీ లేకపోవడంతో 'హరి హర వీరమల్లు'ని తెరకెక్కిస్తున్నా డైరెక్టర్ క్రిష్ పరిస్థితి ఏంటనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం 'హరి హర వీరమల్లు' ప్రాజెక్ట్ ని డిసెంబర్ వరకు పూర్తి చేసి ఆ తరువాత నుంచి బ్యాక్ టు బ్యాక్ రీమేక్ లని పట్టాలెక్కించాలన్నది పవన్ ప్లాన్. కానీ తాజాగా మారిన నిర్ణయంతో ఏ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నది సస్పెన్స్ గా మారింది. 'హరి హర వీరమల్లు' తరువాత పవన్ కల్యాణ్ ..సముద్రఖని దర్శకత్వంలో 'వినోదాయ సితం' రీమేక్ తో పాటు సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించనున్న 'తేరీ'ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. ఏం జరగనుందో తెలియాంటేమరో వారం వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.