కేఏ పాల్ జోకులు భలే పేలాయ్

Update: 2017-04-06 11:16 GMT
కేఏ పాల్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఆయన పేరుతో ఉన్న అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి గత కొన్ని రోజులుగా సెన్సేషనల్ ట్వీట్లు పడుతున్న సంగతి తెలిసిందే. అవి జనాలకు భలే వినోదం పంచుతున్నాయి. నిజంగా ఆయనే ఈ ట్వీట్లు చేస్తున్నారా.. లేక ఎవరైనా ఆయన పేరుతో ఇలా చేస్తున్నారా అన్నది తెలియదు. కానీ ఈ ట్వీట్లయితే జనాల్ని భలే ఎంటర్టైన్ చేస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన కొన్ని ట్వీట్ల ముచ్చట్లేంటో చూద్దాం.

‘‘దేవుడిచ్చిన టాలెంట్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో వుంటారు. ఆఫ్ కోర్స్ నేను కూడా..'' అంటూ నందమూరి హీరోను ఆకాశానికెత్తేస్తూ పనిలో పనిగా తననూ పొగిడేసుకున్నాడు పాల్. బీకాంలో ఫిజిక్స్ కామెంట్లతో పాపులరైన జలీల్ ఖాన్ పైనా ఒక జోక్ పేల్చాడు పాల్. ‘‘విద్యా మంత్రిత్వశాఖ కచ్చితంగా జలీల్ ఖాన్ కే ఇవ్వాలి. ఈ విషయంలో అతనికి సాటి మరొకరు లేరు'' అన్నాడాయన. ఎండతో తల్లడిల్లుతున్న హైదరాబాద్ ను ఆశీర్వదించి.. వర్షం కురిపించింది తానేనని కూడా పాల్ సెలవిచ్చాడు.

పవన్ అభిమానులు గొప్పగా చెప్పుకునే ‘పవనిజం’ లోకల్ అని.. తన ‘పాలిజం’ విశ్వవ్యాప్తమని అన్నాడు పాల్. నారా లోకేష్ ను మంత్రిని చేయబోతున్నట్లు ఇంతకుముందు చెప్పిన పాల్.. మంత్రిగా అతడి ప్రమాణ స్వీకారానికి రాకపోవడానికి కారణం చెప్పాడు. తన విమానానికి రిపేర్ రావడం వల్లే ఆ వేడుకకు రాలేకపోయానన్నాడు. లోకేష్ కు మూడు పోర్ట్ ఫోలియోలు ఇవ్వడం అంటే ఆరో తరగతి కుర్రాడిని ఐఐటీ జేఈఈ పరీక్ష రాయమనడం లాంటిదని ఆయన సెటైర్ వేయడం విశేషం. ఆ తర్వాత పాల్ ఫోకస్ బండ్ల గణేష్ మీదికి మళ్లింది. ‘‘బండ్ల గణేష్ నువ్వు ట్రంప్ తో ఫొటో దిగొచ్చు. కానీ ట్రంప్ నా అపాయింట్ మెంట్ తీసుకుంటాడు నాతో ఫొటో దిగడానికి’’ అన్నాడు పాల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News