#MAAelection : తొలి ఓటు పవన్ దే.. తిప్పికొడితే 900 ఓట్లు లేవు.. ఎందుకీ లొల్లి

Update: 2021-10-10 05:30 GMT
'మా' ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిట్స్ లోని పబ్లిక్ స్కూల్ లో 8గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.  ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 'మా' ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు.

ఈ సందర్భంగా 'మా' ఎన్నికలపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'తిప్పి కొడితే 900 ఓట్లు కూడా లేవు. దీనికోసం ఎందుకు వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు? అవసరమా?' అని పవన్ సినీ ప్రముఖులను ప్రశ్నించారు.

సినిమాలు చేసే వాళ్లు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయని పవన్ ఆక్షేపించారు. మా ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి పోటీని చూడలేదని అన్నారు. సినిమా ఇండస్ట్రీని చీల్చడం అనే సమస్యే ఉండదని తేల్చిచెప్పారు.

ఇక మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్న ప్రచారం జరుగుతున్న దానిపై పవన్ స్పందించారు. 'వారిద్దరూ మంచి ఫ్రెండ్స్' అంటూ పేర్కొన్నారు. సినిమా వాళ్లు చేసే పనులు ఆదర్శంగా ఉండాలంటూ పవన్ పిలుపునిచ్చారు.

ఇక తొలి ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం బయట తనను కలిసిన ప్రకాష్ రాజ్, మంచు మనోజ్ లను హగ్ చేసుకొని వారితో సరదాగా పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కుషల ప్రశ్నలు, జోకులతో కొద్దిసేపు అలరించారు. పవన్ రాకతో మీడియా హడావుడి ఎక్కువైంది. ఆయనపై మైకులు పెట్టడంతో 'మీడియా నాపై దాడి చేస్తుందా?' అంటూ సరదాగా పవన్ మాట్లాడారు.

https://twitter.com/VinayNaik27/status/1447041038019809280?s=20
Tags:    

Similar News