'డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తన జిప్ తీసి.. నా సల్వార్ కమీజ్ నాడా లాగాడు'
'ప్రయాణం' 'ఊసరవెల్లి' చిత్రాల హీరోయిన్ పాయల్ ఘోష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డ్రగ్స్ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'బాలీవుడ్ దర్శకుడొకరు నన్ను రూమ్ లోకి తీసుకెళ్లి బ్లూ ఫిల్మ్ చూపించాడని.. నేను ఏ హీరోయిన్ ని పిలిచినా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుందని అతను చెప్పాడని.. కానీ నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకున్నాన'ని అంటూ సంచలన విషయాలు వెల్లడించింది. అప్పుడు ఆ డైరెక్టర్ ఎవరో చెప్పని పాయల్ ఘోష్.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'తనతో అసభ్యకరంగా ప్రవర్తించింది.. తనను బలవంతం చేసిన బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
పాయల్ మాట్లాడుతూ.. "నన్ను ఇబ్బంది పెట్టిన డైరెక్టర్.. అనురాగ్ కశ్యప్. అతను ఇప్పుడు మహిళల గురించి.. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాడు. నేను అనురాగ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన విస్కీ స్కాచ్ లాంటిది తాగుతున్నాడు. దాంతో పాటు డ్రగ్ గంజాయి లాంటిదేదో తీసుకుని ఉన్నారనుకుంటున్నాను. నన్ను అక్కడి నుంచి మరో గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలో బుక్స్ మ్యూజిక్ వీడియో క్యాసెట్స్ ఎక్కువగా ఉన్నాయి. టీవీ కూడా ఉంది. అక్కడ ఉన్న సోఫాలో ఇద్దరం కూర్చున్నాం. ఆ టైంలో అనురాగ్ కశ్యప్ 'బాంబే వెల్వెట్' సినిమా చేస్తున్నాడు. రణబీర్ కపూర్ సినిమాలో చిన్న సీన్ లో అయినా నటించాలనుకునే అమ్మాయిలు నాతో పడుకోడానికి రెడీగా ఉన్నారు అని నాతో చెప్పాడు. హుంబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని.. అమితాబ్ కి పెద్ద ఫ్యాన్ ని అని.. ఇప్పుడు అమితాబ్ లాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి అతనితో అభిషేక్ బచ్చన్ తో సినిమా చేయమని అడుగుతున్నారని.. నేను ఆ లెగసీని ఎంజాయ్ చేస్తున్నానని.. కరణ్ జోహార్ నాకు ప్రతి రోజు కాల్ చేసి నాతో ప్రతి విషయం మాట్లాడతాడని చెప్పాడు. నేనెంత గొప్ప వ్యక్తినో అర్థం చేసుకోవాలని.. తనతో సన్నిహితంగా మెలిగితే భవిష్యత్తులో ఎలాంటి మేలు జరుగుతుందో ఆలోచించుకోమని అన్నాడు'' అని చెప్పింది.
''అదే సమయంలో తన జిప్ తీసి.. నా సల్వార్ కమీజ్ నాడా లాగాడు. నన్ను బలవంతం చేయబోయాడు. నేను అందుకు ఒప్పుకోలేదు. ఇట్స్ ఓకే.. సినిమా ఇండస్ట్రీలో శారీరక సంబంధం కలిగి ఉండటం పెద్ద తప్పేం కాదు అన్నాడు. నేనెప్పుడు పిలిచినా వచ్చి నేనేం చేయమంటే అది చేస్తారని చెప్పాడు. నేను కూడా వారిలాగానే చేస్తానని అనుకున్నాడు. కానీ నేను అన్ కంఫర్టబుల్ గా ఉన్నాను.. శారీరకంగా మానసికంగా రెడీగా లేనని.. తర్వాత కలుస్తానని చెప్పి వచ్చేశాను. ఆ సమయంలోనే నేను బయటకు చెబుదామంటే నన్ను చాలా మంది వద్దని భయపెట్టారు. నీపై యాసిడ్ దాడి జరగొచ్చు.. నిన్ను కిడ్నాప్ చేయవచ్చని చెప్పి ఇతర ఆర్టిస్టులను వారెంతో బాధపెట్టారనే విషయాన్ని చెప్పారు. ఇది 2014 లేదా 2015 లో జరిగింది. నాకు కరెక్ట్ గా గుర్తులేదు. అయినా ఒక అమ్మాయి డైరెక్టర్ ని సినిమా ఛాన్స్ కోసం కలవొచ్చు. అంతమాత్రాన వేశ్య కాదు" అని పాయల్ ఘోష్ చెప్పుకొచ్చింది.