ఇక్కడకు రావడానికి ఆరేళ్లు పట్టింది

Update: 2019-10-11 08:33 GMT
'ఆర్‌ ఎక్స్‌ 100' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పాయల్‌ రాజ్‌ పూత్‌ నేడు 'ఆర్డీఎక్స్‌ లవ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సి కళ్యాణ్‌ నిర్మించిన ఆర్డీఎక్స్‌ లవ్‌ చిత్రానికి శంకర్‌ భాను దర్శకత్వం వహించాడు. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌ పూత్‌ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యింది. ఈ స్థాయికి వచ్చేందుకు తాను పడ్డ కష్టం గురించి పాయల్‌ మాట్లాడిన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి.

పాయల్‌ మాట్లాడుతూ.. ముంబయిలో సినిమా అవకాశాల కోసం ఆరు సంవత్సరాలు తిరిగాను. ఆ ఆరు సంవత్సరాల్లో ఎంతో మంది సౌత్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ నా ఆడిషన్స్‌ తీసుకున్నారు. కాని ఏ ఒక్కరు కూడా నాకు ఛాన్స్‌ ఇవ్వలేదు. నేను ఆ సమయంలో తీవ్రమైన డిప్రెషన్‌ లోకి వెళ్లి పోయాను. ఎందరినుండో తిరష్కరణకు గురైనా కూడా నా ప్రయత్నాలు వదిలి పెట్టకుండా ముంబయిలో తిరిగాను. ఎట్టకేలకు ఇప్పుడు టాలీవుడ్‌ లో మంచి హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్నానంటూ గత జ్ఞాపకాలను నెమరవేసుకుంది.

ఆర్టీఎక్స్‌ లవ్‌ గురించి పాయల్‌ మాట్లాడుతూ ఇదో మంచి ఎంటర్‌ టైనర్‌ మరియు ఎడ్యుకేటెడ్‌ సినిమా. ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను అందించడంతో పాటు ఆలోచింపజేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేసింది. స్టోరీ లైన్‌ వినగానే నాకు నచ్చి వెంటనే నటించేందుకు సైన్‌ చేశాను. 45 రోజుల పాటు పాపి కొండలు.. పోలవరం ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. అక్కడ మొబైల్‌ సిగ్నల్‌ లేదు.. సరైన ఫుడ్‌ లేదు.. సరైన వసతి లేదు అయినా కష్టపడి సినిమాను పూర్తి చేశాం. ఈ మంచి సినిమా కోసం మేము పడ్డ కష్టంకు తప్పకుండా ప్రతిఫలం వస్తుందని ఆశిస్తున్నామంది.

Tags:    

Similar News