అరుంధ‌తి 2 ఫేక్ ..శ‌బ్ధాల‌యా వ‌ర్గాల వెల్ల‌డి!

Update: 2019-06-23 16:43 GMT
ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ క‌థానాయిక‌గా `అరుంధ‌తి 2` తెరకెక్క‌నుంద‌ని ప్ర‌చార‌మైంది. అందుకోసం పాయల్ క‌త్తి యుద్ధాలు.. గుర్ర‌పు స్వారీ నేర్చుకుంటోంద‌ని ఓ ప్రెస్ నోట్ ద్వారా వెల్ల‌డించారు. సీక్వెల్ కు సంబంధించిన ప్ర‌క‌ట‌న స‌డెన్ గా వెలువ‌డ‌డం అంద‌రికీ షాక్ నిచ్చింది. ఈ ప్ర‌క‌ట‌న‌ శ్యాం ప్ర‌సాద్ రెడ్డి నుంచి కాకుండా వేరొక నిర్మాత నుంచి రావ‌డంతో అందులో నిజానిజాలెంత‌? అన్న సందేహాలు క‌లిగాయి. ఇదేమైనా ఫేక్ న్యూసా? అంటూ అరుంధ‌తి అభిమానులు కంగారు ప‌డ్డారు. ఇండ‌స్ట్రీ బెస్ట్ ప్రొడ్యూస‌ర్ శ్యాం ప్ర‌సాద్ రెడ్డి అహోరాత్రులు శ్ర‌మించి చెమ‌టోడ్చి అవ‌స‌రానికి అప్పు సొప్పు చేసి భారీగా పెట్టుబ‌డులు పెడితే ఆ ప్రాజెక్టు బ‌య‌టికి వ‌చ్చింది. అలాంటిది  ఆ సినిమాకి సీక్వెల్ తీసేస్తున్నాం! అంటూ ఎవ‌రో ఒక నిర్మాత అప్ప‌టిక‌ప్పుడు అరుంధ‌తి 2 టైటిల్ ని ప్ర‌క‌టించేయ‌డంతో ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది.

వాస్త‌వానికి అరుంధ‌తి సీక్వెల్ తీయాల‌న్న ఉద్ధేశం ఒక ఫిలింమేక‌ర్ గా శ్యామ్ ప్ర‌సాద్ కి ఎప్ప‌టినుంచో ఆలోచ‌న ఉంది. కానీ ఇన్నాళ్లు క‌థ రెడీ కాలేదు. బ‌డ్జెట్ ప‌ర‌మైన కొన్ని చిక్కులు ఉన్నాయి. ఒక‌వేళ అరుంధ‌తి సీక్వెల్ తీయాలంటే అందుకు త‌గ్గ క‌థ ముందుగా సిద్ధం కావాల్సి ఉంటుంది. అదేమీ అంత వీజీ కాద‌ని నిర్మాత శ్యాం ప్ర‌సాద్ రెడ్డి భావించారు. అరుంధ‌తి స్టోరీ ఓ మాస్ట‌ర్ పీస్. దానిని తిరిగి రిపీట్ చేయ‌డం అంటే గ్రౌండ్ వ‌ర్క్ కోస‌మే ఏడాది పైగా ప‌డుతుంది. ఒక‌వేళ ఆ ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టుపై దృష్టి సారించాలంటే అందుకోసం చాలా విలువైన స‌మ‌యం కేటాయించి ఆ క‌థ‌ను వండించే ప‌నిలోకి దిగుతారు. కానీ అంత స‌మ‌యం ఆయ‌న‌కు లేదు. అందుకే ఆ ప‌నిలోకి దిగ‌లేద‌ని తెలుస్తోంది.

అయితే నిన్న‌టిరోజున ఉన్న ఫ‌లంగా అరుంధ‌తి 2 తీస్తున్నాం! అంటూ ఎవ‌రో ఓ నిర్మాత ప్ర‌క‌టించేయ‌డంతో ఒక‌టే క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. అంతేకాదు శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన శ‌బ్ధాల‌యా వ‌ర్గాలు అస‌లు అరుంధ‌తికి సీక్వెల్ లేనేలేదు. ఆ ప్ర‌క‌టించిన వాళ్లు ఆ సినిమా తీయ‌బోవ‌డం లేదు! ఆ వార్త‌ల్ని న‌మ్మొద్దు.. !! అంటూ ఆ వార్త‌ను ఖండించడంతో అస‌లేం జ‌రుగుతోంది? అన్న సందిగ్ధ‌త నెల‌కొంది. ఇంత‌కీ అరుంధ‌తి 2 అనే టైటిల్ వాడుకుని వీళ్లు ఏం చేయాల‌నుకుంటున్న‌ట్టు?  ఆ క్లాసిక్ సినిమాపై ప్రేక్ష‌కాభిమానుల్లో ఎంతో అభిమానం ఉంది. దానిని చెడ‌గొట్టే ప్ర‌య‌త్న‌మా ఇదీ? అంటూ చాలా సీరియ‌స్ గానే ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి స‌మాధానం చెప్పేదెవ‌రు?

 
Tags:    

Similar News