మీటూలో రివర్స్ పంచ్ ఇది! బయటపడడానికి.. పడకపోవడానికి మధ్య ఉండే సన్నని లైన్ చినిగిపోయింది. బయటపడితే అవకాశాలు రావు. ఆడిషన్స్‌కి పిలవరు. అప్పటికే పిలిచినవాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. ప్రస్తుతం తనూశ్రీ సీక్వెన్సులో ఇదో కొత్త పరిణామం. కొందరు కథానాయికలు ధైర్యంగా మీటూ ఇండియా వేదికపై గళం విప్పిన పర్యవసానం అంతే దారుణంగా ఉండబోతోందని సంకేతాలు అందుతున్నాయి.
రంగుల ప్రపంచంలో కమిట్ మెంట్ - వేధింపులు అనేవి సర్వసాధారణమైన విషయంగానే పరిగణిస్తున్నారంతా. ఇక్కడ కమిట్ మెంట్ తప్పనిసరి. కాస్టింగ్ కౌచ్ మస్ట్ & షుడ్. అయితే అందుకు అంగీకరించలేకే ఎందరో తెలుగమ్మాయిలు ఈ రంగం వైపు దృష్టి సారించలేదన్నది అంతే వాస్తవం. అయితే తాజాగా మీటూ ఉద్యమంతో ఇక తెలుగమ్మాయిలు ఈ ప్రపంచం వైపు చూడడం అన్నది అసాధ్యం అన్న మాట వినిపిస్తోంది.
తాజాగా యశ్ రాజ్ ఫిలింస్ కథానాయిక చెప్పిన ఓ వాస్తవం `రివర్స్ మీటూ`కి - `మెన్ మీటూ`కి సింబాలిక్ అనిపించక మానదు. యశ్ రాజ్ ఫిలింస్ ఆస్థాన దర్శకుడిగా పేరున్న దిబాకర్ బెనర్జీ అంతటి వాడిపై 11ఏళ్ల క్రితం జరిగిన ఓ వేధింపుల ఘట్టంపై యువకథానాయిక పాయల్ రోహిత్గి తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల అనంతరం దిబాకర్ ఆరు సినిమాలు తీశాడు. ఇప్పటికి మీటూ వేదికగా మరోసారి పాయల్ రోహిత్గీ ఆరోపించడం సంచలనమైంది. అయితే ఈ ఆరోపణల అనంతరం తనని ఆడిషన్స్ కే పిలవడం మానేశారని పాయల్ వాపోతోంది. పలు కంపెనీల ఆడిషన్స్ క్యూలో ఉన్నా తనని పిలవడం లేదని తెలిపింది. దిబాకర్ విషయంలో యశ్ రాజ్ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూస్తున్నాని అంది.