నెల రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర పండగ చేసుకుంది ‘పెళ్లిచూపులు’. ముందే ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ.. మరీ ఆ స్థాయిలో దుమ్ము దులిపేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. మల్టీప్లెక్స్ సినిమా అనుకున్నది
కాస్తా.. అన్ని సెంటర్లలోనూ దంచేసింది. చిన్న చిన్న సెంటర్లలోనూ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక ‘ఎ’ సెంటర్లలో అయితే తిరుగులేదు. నాలుగో వారంలో కూడా హౌస్ ఫుల్స్ పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడి-రాబడి లెక్కల్లో చూస్తే తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటిగా ఈ సినిమాను చెప్పుకోవాలి. ఈ నెల 1న ‘జనతా గ్యారేజ్’ వచ్చే వరకు దాదాపు నెల రోజుల పాటు ‘పెళ్లిచూపులు’ సినిమానే బాక్సాఫీస్ లీడర్ గా కొనసాగింది.
ఐతే ఎన్టీఆర్ సినిమా వచ్చాక ‘పెళ్లిచూపులు’ సైడివ్వక తప్పలేదు. చాలా వరకు థియేటర్ల నుంచి ‘పెళ్లిచూపులు’ సినిమాను ఖాళీ చేశారు. తర్వాతి వారం కూడా రెండు సినిమాలు మంచి అంచనాల మధ్య వచ్చాయి. దీంతో ‘పెళ్లిచూపులు’ థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తయింది. ముందు పది కోట్ల షేర్ అనుకుంటే.. ఆ తర్వాత రూ.20 కోట్ల మార్కును దాటేసింది. ఫైనల్ గా ఈ సినిమా షేర్ రూ.26 కోట్ల దాకా వచ్చినట్లు సమాచారం. ఒక్క అమెరికాలో మాత్రమే ఈ సినిమా మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అక్కడ పెట్టుబడి మీద దాదాపు 30 రెట్లు వసూలైనట్లు అంచనా. ఈ సినిమా బడ్జెట్ చూస్తే కేవలం రెండు కోట్లు. అది కూడా పబ్లిసిటీతో కలుపుకుంటే.