ఈ మధ్య తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండే షోలను ప్లాన్ చేయడం కాస్త ఎక్కువయింది. తెలుగులో సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానం ఉన్న బిగ్ బాస్ కూడా విజయం సాధించడంతో టీవీ ఛానల్స్ మరింత డేరింగ్ గా ఈ విషయంలో ముందుకెళ్తున్నాయి. ఇదే బాటలో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్యక్రమం 'పెళ్ళిచూపులు'.
టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తనకు సరైన జోడీ ఎవరో ఎంచుకోవడమే ఈ కార్యక్రమం కాన్సెప్ట్. ప్రదీప్ ను పెళ్ళిచేసుకునేందుకు చాలామంది ఔత్సాహిక యువతులు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమాన్ని మరో యాంకర్ సుమ నిర్వహించింది. రాజుల కాలం నాటి స్వయంవరం లాంటిదే కాకపోతే రివర్సు లో. కానీ ఎందుకో మొదటి రోజు నుండే ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. డేటింగ్ టైపులో అనిపించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఛానెల్ వారు ఈ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఫైనల్ ఎపిసోడ్ లో ప్రదీప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒక అమ్మాయిని ఎంపిక చేసుకున్నాడు.
ఇక ఆ అమ్మాయిని ప్రదీప్ నిజంగా పెళ్ళిచేసుకుంటాడా లేదా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా ఈ షో ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ కార్యక్రమం పూర్తవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఈ రేంజ్ లో విమర్శలు ఎదుర్కొన్న టీవీ షో.. పెళ్ళిచూపులు మాత్రమే.