తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. అత్యున్నత స్థాయిలో ఇంత సుదీర్ఘ కాలం తన ప్రస్థానాన్ని కొనసాగించడం అందరికీ సాధ్యం కాదు. తొలి సినిమా ‘సిరివెన్నెల’తోనే ఆయన పతాక స్థాయిని అందుకున్నారు. ఇక అప్పట్నుంచి తన మహా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. మధ్యలో అనారోగ్యం కారణంగా కొంచెం జోరు తగ్గించిన సీతారామశాస్త్రి.. ఈ మధ్య మళ్లీ ఊపు అందుకున్నారు. తరచుగా పాటలు రాస్తున్నారు. ఈ ఏడాది ఆయన ఇప్పటికే దాదాపు పది పాటల దాకా రాయడం విశేషం. ‘అజ్ఞాతవాసి’లో ‘గాలి వాలుగా’తో మొదలు పెట్టి ఈ ఏడాది తాను రాసిన ప్రతి పాటలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. తనకు అత్యంత ఆప్తుడు.. బంధువు కూడా అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ‘అరవింద సమేత’లో ఆయన రెండు పాటలు రాయడం విశేషం.
ఇందులో ఒక పాట ఇప్పటికే విడుదలైంది. ‘అనగనగా..’ అంటూ సాగే ఆ పాట వెంటనే జనాలకు ఎక్కేసింది. ఇందులో ఆయన సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరికీ అర్థమయ్యేలా చాలా సరళంగా.. అందంగా ఆ పాట రాశారాయన. ఇదే సినిమాలో ‘ఏడ పోయినాడో’ అంటూ ఇంకో పాటను కూడా సీతారామశాస్త్రి రాశారు. ఐతే ఈ పాటను ఆయనొక్కరే రాయలేదు. ‘కృష్ణార్జున యుద్ధం’లో దారి చూడు దమ్ము చూడు అనే పాటను రాసి పాడటం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన పెంచల్ దాస్ కు కూడా ఈ పాటలో భాగస్వామ్యం ఉంది. మామూలుగా సిరివెన్నెల వారి స్థాయికి ఆయన ఇంకొకరితో పాటను పంచుకోవాల్సి రావడం అరుదు. ఆయనకు ఆ అవసరం రాదు. ఏ దర్శకుడూ అలాంటి సాహసం చేయడు. ఐతే ‘అరవింద సమేత’ రాయలసీమ నేపథ్యంలో సాగే పాట. ఇక్కడి నేటివిటీని బాగా ‘రా’గా చూపించబోతున్నారు సినిమాలో. ఇందుకోసం ఈ ప్రాంతానికి చెందిన పెంచల్ దాస్ సాయం తీసుకుంటున్నాడు త్రివిక్రమ్. స్క్రిప్టులోనూ అతడి సహకారం ఉంది. అలాగే ‘ఏడ బోయినాడో’ పాటకు శాస్త్రిగారు కూడా కొంచెం పదాల సాయం తీసుకున్నట్లుంది. అందుకే అతడికి కూడా క్రెడిట్ ఇచ్చినట్లున్నారు.