కొన్ని కొన్ని సంఘటనలు భారీ ఎత్తున పబ్లిక్ ను ఆకర్షిస్తాయి. అంతే స్థాయిలో నవ్వు కూడా పుట్టిస్తాయి. అవి ఉద్దేశ పూర్వకంగా జరిగినవి అయి ఉండకపోవచ్చు. కానీ, ఖచ్చితంగా అందరినీ నవ్వుల్లో ముంచెత్తిస్తాయి. అలాంటి సంఘటనే నందమూరి నటసింహం.. బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న పూరీ డైరెక్షన్ మూవీ పైసా వసూల్ ఆడియో వేడుకలో చోటు చేసుకుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది కూడా. ఇక, ఈ మూవీ ఆడియో వేడుకను ఖమ్మంలో రెండురోజుల కిందట భారీ ఎత్తున నిర్వహించారు. దీనికి స్థానికులే కాకుండా విజయవాడ - కృష్ణాజిల్లాల నుంచి కూడా నందమూరి అభిమానులు పోటెత్తారు.
దీంతో నిర్మాత సహా బాలయ్య - పూరి కూడా ఖుషీ అయ్యారు. వేల మందిగా తరలివచ్చిన జనాల్ని చూసి బాలయ్య ఆనందం ఆపుకోలేక పోయాడు కూడా. ఇక, ఈ వేడుక ప్రారంభం నుంచే వరుణుడు తన ప్రతాపం ప్రారంభించేశాడు. దీంతో కార్యక్రమం ప్రారంభానికి ముందు బాగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓపెన్ స్టేడియం కావడంతో నిర్వాహకులు వర్షం ఆగుతుందేమోనని కార్యక్రమాన్నికొద్ది సేపు వాయిదా కూడా వేశారు. అయినా కూడా ఎక్కడా వర్షం తగ్గుముఖం పట్టలేదు. దీంతో కార్యక్రమాన్ని యధావిథిగా లాగించేశారు.
ఈ నేపథ్యంలో కార్యక్రమానికి వచ్చిన వారు తాము కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలనే గొడుగులుగా మార్చుకుని నిలబడి కార్యక్రమం మొత్తాన్ని ఆశ్వాదించారు. ఇలాగే నిలబడి ఈలలు చప్పట్లతో బాలయ్యకు కిర్రెక్కించారు. అంతా అయిపోయింది. ఇక వెళ్లొచ్చు అని అనౌన్స్ మెంట్ రాగానే... ఎలా నిలబడ్డవారు అలాగే ఇంటి ముఖం పట్టారు! ఇందులో ఆశ్చర్యమేముంది అంటున్నారా? అక్కడే ఉంది మజా! వర్షానికి అడ్డుగా పెట్టుకున్న కుర్చీలను అలానే పట్టుకుని వెళ్లిపోయారట బాలయ్య అభిమానులు. అది ఓపెన్ గ్రౌండ్ కావడం - మరోపక్క - వర్షం వస్తుండడంతో వారిని నిలువరించే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయలేదు. దీంతో దాదాపు 10 వేలకు పైగా కుర్చీలు మాయమయ్యాయని నిర్వహకులు లబోదిబోమన్నారు. ఇక, ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలయ్యంటే కిట్టని కొందరు పెద్ద ఎత్తున జోక్స్ పేలుస్తున్నారు. పైసా వసూల్ కాదు.. ఇది కుర్చీల వసూల్ అయిందంటూ ఆటపట్టిస్తున్నారట!!
Full View