తెలుగు బిగ్ బాస్ పై ప్రతి సారి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఈ షో అంత చెత్త షో ఏదీ లేదు... మన సాంస్కృతి మరియు సాంప్రదాయాలను మంట కల్పే విధంగా ఈ షో ఉంటుంది అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా బిగ్ బాస్ ను చూసే వారు చూస్తూనే ఉన్నారు. ప్రతి సీజన్ కు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది కాని తగ్గడం లేదు. ఈసారి బిగ్ బాస్ కు కూడా మంచి ఆధరణ లభిస్తుంది. ఇంటి సభ్యులు కుస్తీ పోటీలు పడుతున్నారు వీళ్లేం కంటెస్టెంట్స్ రా బాబు అనుకుంటూ.. వారిని తిడుతూ ట్రోల్ చేస్తూనే షో ను కంటిన్యూ గా చూస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా బిగ్ బాస్ కు రికార్డు రేటింగ్ రావడం ఆశ్చర్యంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 కర్టన్ రైజ్ ఎపిసోడ్ కు వచ్చిన రేటింగ్ షో కు ఏ స్థాయిలో ప్రేక్షకుల ఆధరణ ఉందో చెప్పకనే చెబుతోంది. ప్రారంభ ఎపిసోడ్ ఏకంగా నాలుగు గంటలకు ఎక్కువే వచ్చింది. దానికి 18 రేటింగ్ దక్కినట్లుగా సమాచారం అందుతోంది.
ఈమద్య కాలంలో ఈ స్థాయి రేటింగ్ అంటే మామూలు విషయం కాదు. క్రేజీ మూవీస్ కు కూడా ఈస్థాయిలో రేటింగ్ దక్కలేదు. సాదారణంగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ కు మంచి ఆధరణ ఉంటుంది. కాని వీక్ డేస్ ఎపిసోడ్స్ కు మాత్రం జనాల ఆధరణ కాస్త తక్కువగా ఉంటుంది అనేది టాక్. కాని ఈసారి వీక్ డేస్ ఎపిసోడ్స్ కు కూడా మంచి రేటింగ్ ను దక్కించుకుంది. మొదటి రోజు ఎపిసోడ్ మొదలుకుని కంటిన్యూస్ గా జనాలు బిగ్ బాస్ ను మిస్ అవ్వకుండా చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈసారి కూడా కంటెస్టెంట్స్ విషయంలో విమర్శలు వస్తున్నాయి. చాలా మందిని కనీసం గతంలో చూసిందే లేదు. ఎలా వీళ్లను తీసుకు వచ్చారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఒక వైపు ట్రోల్స్ చేస్తూనే మరో వైపు షో ను చూస్తేనే ఉన్నారు. సోషల్ మీడియాలో షో కు జరుగుతున్న పబ్లిసిటీ మరియు షో గురించి వినిపిస్తున్న విమర్శలు వివాదాల కారణంగా చాలా మంది షో ను చూడాలని ఆశ పడుతున్నారు. చాలా రకాలుగా షో ను చూసేందుకు సిద్దం అవుతున్నారు అనేది టాక్.
సోషల్ మీడియాలో లో ఎప్పుడు కూడా బిగ్ బాస్ గురించిన ట్రెండ్డింగ్ నడుస్తుంది. అందుకే షో కు ఈ స్థాయిలో రేటింగ్ దక్కుతోంది. క్రియేటివ్ టీమ్ ఇదే ఇంట్రెస్ట్ ను కంటిన్యూ చేయగలిగితే ఖచ్చితంగా షో ముందు ముందు మంచి రేటింగ్ ను కంటిన్యూగా తెచ్చుకుంటుంది అంటూ నమ్మకం వ్యక్తం అవుతోంది. ఒక వైపు జెమిని టీవీలో ఎన్టీఆర్ షో ఎవరు మీలో కోటీశ్వలు ప్రసారం అవుతున్నా కూడా స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కు ఏమాత్రం రేటింగ్ లో తగ్గుదల కనిపించడం లేదు. రెండు షో లు టైమ్ లు వేరు అవ్వడం వల్ల ఎన్టీఆర్ షో కు నష్టం తప్పిందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు బుల్లి తెరపై తనకు తిరుగు లేదని మరో సారి నిరూపించుకున్నాడు.