పోర్న్ చూసే వరకే.. చేతల్లోకి వెళితే తిప్పలేనట!

Update: 2019-09-04 04:57 GMT
పెద్దలకు మాత్రమే పరిమితమైన చిత్రాలు.. పోర్న్ మూవీస్ ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేవి. అలాంటి వాటిని చాలా గుట్టుగా చూసే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. చేతిలోకి ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చేసి.. అందులో డేటాను జీబీల కొద్దీ చౌకగా వాడేసే అవకాశం వచ్చేసిందో.. అప్పటి నుంచి మొత్తం విషయంలో మార్పు వచ్చేసింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ కూర్చొని పోర్న్ చూసే అవకాశం వచ్చేసింది.

విషయం ఎంతలా ముదిరిపోయిందంటే.. చట్టసభల్లో కూర్చున్న ప్రజాప్రతినిధులు సైతం తమ సెల్ ఫోన్లో పోర్న్ సీన్లను చూసే వరకూ వెళ్లింది. ఇలాంటి ఉదంతాలు బయటకు రావటం.. పెద్ద రచ్చ రావటం.. కొందరు నేతల పదవులు పోవటం లాంటివి చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే.. పోర్న్ మూవీలో మాదిరి కొందరు ప్రాక్టికల్స్ ను మొదలెట్టేసి ఇబ్బందులకు గురి అవుతున్న విషయం బయటకు వచ్చింది.

పోర్న్ లను విరివిగా చూసి.. అలాంటి భంగిమల్ని తాము నిజ జీవితంలో అనుసరించాలన్న ఆలోచనతో కొత్త కష్టాల్ని అరువు తెచ్చుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోందట. శృంగారాన్ని రోటీన్ గా ఫీల్ అవుతున్న వారు కొత్తగా ట్రై చేయాలన్న ఉద్దేశంతో పోర్న్ ను ఫాలో అవుతున్నారని.. దాని వల్ల అసలుకే ఎసరు వస్తున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.

సెక్స్ విషయంలో అతి ఎప్పుడూ అంత మంచిది కాదని.. పోర్న్ వీడియోలలో నటించే వారంతా.. ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవటంతో పాటు.. తమ శరీరాన్ని ఎలాంటి భంగిమలో అయినా ఉంచేందుకు వీలుగా ట్రైనింగ్ తీసుకుంటారన్న నిజాన్ని మర్చిపోకూడదని సెలవిస్తున్నారు.

ఈ విషయాన్ని మర్చిపోయి.. ఎక్సైట్ మెంట్ కోసం ప్రయత్నిస్తే.. నడుము పట్టేయటం.. కాళ్లు.. చేతులు పట్టేయటం లాంటి కొత్త సమస్యల్ని ఎదుర్కోవటం ఖాయమని చెబుతున్నారు. సెక్స్ ను ఎంజాయ్ చేయటం మంచిదే కానీ.. కొత్త మోజులో పడి కొత్త సమస్యల్ని ఆహ్వానించటంలో అర్థం లేదంటున్నారు సెక్సాలజిస్ట్ లు. .  శృంగారంలో పాల్గొనే ఇద్దరు భాగస్వాములు తమకు అనువైన భంగిమల్ని మాత్రమే ఎంచుకోవాలే తప్పించి.. పోర్న్ చూసి ఫాలో అయితే అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News