వీడియో సాంగ్: పెప్సీ ఆంటీకి విజిల్స్ ప‌డాల్సిందే

Update: 2021-03-21 06:41 GMT
ఆర్జీవీ డిస్క‌వ‌రీ అప్స‌రా రాణి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆర్జీవీ డీ గ్యాంగ్ తో క‌లిసి బోలెడంత ర‌చ్చ చేస్తున్న ఈ బ్యూటీకి పబ్లిసిటీ ఓ రేంజులోనే ఉంది. ఇక రామూజీ ఎక్క‌డ ఓడ్కా పార్టీ పెట్టుకున్నా అక్క‌డ ఈ అమ్మ‌డు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోంది. ఇక అప్స‌ర‌తో క‌లిసి వ‌ర్మ చేస్తున్న హంగామా అన్ లిమిటెడ్ అనే చెప్పాలి.

ఇక డీ కంపెనీ నుంచి బ‌య‌టికి వ‌స్తే అప్స‌ర‌కు ఎలాంటి అవ‌కాశాలు ఉన్నాయి? అంటే.. ఇదిగో ఇదే ఆన్స‌ర్. లేటెస్టుగా గోపిచంద్ సీటీమార్ లో పెప్సీ ఆంటీగా ఐటెమ్ నంబ‌ర్ తో అద‌ర‌గొట్టింది అప్స‌ర‌.

సీటీమార్ నుంచి మూడవ లిరికల్ వీడియో సంథింగ్ స్పెష‌ల్ అంటూ యూత్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారంటే అది అప్స‌ర  ట్యాలెంట్ పుణ్య‌మే. అప్స‌ర‌పై మ‌సాలా ఐటమ్ నంబ‌ర్ ఓ రేంజులో క్లిక్క‌య్యింది. పెప్సీ ఆంటీ లిరిక్ అంతే పెప్పీగా బ్లాస్ట్ అవుతోంది.  సాంగ్ ఆద్యంతం వేడెక్కించే నృత్యాల‌తో అప్స‌ర గ్లామ‌ర్ షో పీక్స్ అనే చెప్పాలి. ఇక ఈ పాట‌కు మ‌ణిశ‌ర్మ బాణీ ఓ రేంజులోనే కుదిరింద‌ని చెప్పాలి. ఆస‌క్తిక‌రంగా ఈ పాటను దర్శకుడు సంపత్ నంది స్వయంగా రాశారు.

గోపిచంద్- తమన్నా జంట‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్ ‌లో నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2 న సినిమా విడుదలవుతోంది.

Full View

Tags:    

Similar News