ఓవైపు జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. సినిమా టిక్కెట్ల వివాదం సహా ఇతర విషయాలపై తూర్పారబడుతున్నారు. మరోవైపు ఏపీ మంత్రి పేర్ని నాని సినీప్రముఖులతో వరస సమావేశాలు నిర్వహస్తున్నారు.
ఈ గేమ్ ఏంటో కానీ.. పవన్ వర్సెస్ జగన్ ఎపిసోడ్స్ మరింత ముదురుతున్నట్టే కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఫిలింఛాంబర్ పంపిణీ వర్గాల పెద్దలు సహా పలువురు ప్రముఖులతో పేర్ని నాని హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. టికెట్ ధరలు సహా ప్రభుత్వ పోర్టల్ వ్యవహారాలపై చర్చించారు.
ఇంతలోనే మరో సమావేశం నిర్మాతలతో పేర్ని నాని ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది. మంగళవారం మంత్రికి ఫోన్ చేసి నిర్మాతలు వస్తారని మధ్యవర్తుల ద్వారా చెప్పారట. నేటి (29 సెప్టెంబర్) మధ్యాహ్నం మచిలీపట్నంలో ఉన్న మంత్రి నివాసానికి నిర్మాతలు చేరుకున్నారు. తాజాగా పవన్ వర్సెస్ జగన్ వివాదంపైనా నిర్మాతలు చర్చించనున్నారని తెలిసింది. పవన్ వర్సెస్ పేర్ని నాని మధ్య మాటల తూటాల నేపథ్యంలో మంత్రి దగ్గరకు నిర్మాతల బృందం వెళ్లడం ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు దిల్ రాజు- డీవీవీ దానయ్య- సునీల్ నారంగ్ - బన్ని వాసు తదితరులు పాల్గొన్నారని తెలిసింది. ఈ భేటీలో ఆన్ లైన్ టికెటింగ్ లో ప్రభుత్వ పోర్టల్ రాక సహా సినీపరిశ్రమ ఇతర సమస్యలపైనా చర్చించనున్నారని సమాచారం. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.