పెటా.. ఈ పేరెత్తితే తమిళనాడు జనాలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆ సంస్థ ప్రతినిధులు ఎక్కడైనా కనిపిస్తే కొట్టేలా ఉన్నారు. మొన్నటిదాకా పెటా ప్రచారకర్తగా ఉండటాన్ని తమిళ సెలబ్రెటీలు ఒక హోదాలాగా భావించేవాళ్లు. కానీ ఇప్పుడు పెటా నుంచి దూరంగా పరుగులు పెడుతున్నారు. ఇంతకుముందు ఆ సంస్థ పట్ల సానుకూలంగా ఉన్న వాళ్లు సైతం దానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్నేళ్లుగా పెటాకు ప్రచారకర్తగా ఉన్న త్రిష.. ఈ మధ్య ఎలా ప్లేటు ఫిరాయించిందో తెలిసిందే. పెటాతో తనకు ఏ సంబంధం లేదని.. తాను ఎప్పుడూ అందులో యాక్టివ్ మెంబర్ గా లేనని ప్రకటించి ఆశ్చర్యపరిచింది త్రిష.
దీంతో పెటా వాళ్లు గట్టి త్రిష విషయంలో గట్టిగానే రియాక్టయ్యారు. కుక్కల్ని.. పెంపుడు జంతువుల్ని అమితంగా ప్రేమిస్తానని చెప్పుకునే త్రిష జల్లికట్టుకు మద్దతు తెలపడం ఏంటని ప్రశ్నించారు పెటా ప్రతినిధులు. త్రిషది హిపోక్రసీ అని.. అవసరానికి తగ్గట్లు మాట మార్చేసిందని పెటా ప్రతినిధి మణిలాల్ విమర్శించాడు. పెటాకు త్రిష ఎప్పుడూ ప్రచారకర్తగా వ్యవహరించలేదని అతను స్పష్టం చేశాడు. త్రిష కంటే ముందు పెటా ప్రతినిధులు సూర్య మీద విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమపై సూర్య విమర్శలు చేయడాన్ని తప్పుబడుతూ.. అతను తన సినిమా ప్రచారం కోసమే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నాడన్నారు. దీనిపై సూర్య పెటాకు లీగల్ నోటీసులు కూడా పంపించాడు.